Advertisementt

ట్రిపుల్ ఆర్ ప్రీమియర్స్ షో టాక్

Fri 25th Mar 2022 07:05 AM
ntr,ram charan,rrr overseas show talk,rrr movie,rrr review,rrr premiers show talk,rrr review and rating  ట్రిపుల్ ఆర్ ప్రీమియర్స్ షో టాక్
RRR Premiers show talk ట్రిపుల్ ఆర్ ప్రీమియర్స్ షో టాక్
Advertisement
Ads by CJ

ఎట్టకేలకు మూడేళ్ళ నిరీక్షణకు తెర పడింది, తమ అభిమాన హీరోలని తెరమీద చూసుకుని ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ లో ఆనందం కట్టలు తెంచుకున్న వేళ. ట్రిపుల్ ఆర్ అంటూ గత కొన్ని నెలలుగా ఊహల్లో తేలిపోతున్న ఆడియన్స్ కి ట్రిపుల్ ఆర్ తో రాజమౌళి చెప్పినట్టుగానే బిగ్ ట్రీట్ ఇచ్చేసారు. రియల్ ఫ్రెండ్స్ కాస్తా రీల్ ఫ్రెండ్స్ గా మారి ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన సమయం.. ట్రిపుల్ ఆర్ తో ఫాన్స్ కే కాదు, ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అనేలా ట్రిపుల్ ఆర్ థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఇక ఈసారి ఓవర్సీస్ లోనే కాదు.. ఇండియాలోని పలు సిటీస్ లో మిడ్ నైట్ నుండే ట్రిపుల్ ఆర్ ప్రీమియర్స్ షో సందడి నెలకొంది. ప్రతి ఒక్క సినిమా లవర్ ట్రిపుల్ ఆర్ మ్యానియాతో, ట్రిపుల్ ఆర్ ఫీవర్ తో ఊగిపోతున్నారు.

మరి ట్రిపుల్ ఆర్ ప్రీమియర్స్ షో చూసిన ఆడియన్స్ ఆ సినిమాకి సోషల్ మీడియాలో తమ రివ్యూ లని షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ థియేటర్స్ దగ్గర బ్యానెర్లు, పాలాభిషేకాలు, కటౌట్స్ అంటూ హడావిడీ చేస్తే ఆడియన్స్ తమ టాక్ ని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.

ప్రీమియర్స్ షో టాక్ లోకి వెళితే .. రామ్ చరణ్ పోలీస్, ఎన్టీఆర్ ఇంట్రో సీన్స్ అదిరిపోయాయని, పులితో ఫైట్ సీన్‌లో ఎన్టీఆర్ యంగ్ టైగర్ అనిపించుకొన్నాడు అని, రెండువేల మందితో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ చూస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే అని, రాంచరణ్ ఫ్లయింగ్ సీన్ సూపర్‌గా ఉంది. జంప్ సూట్ లేకుండానే ఇంట్రడక్షన్ సీన్ చేశాడు అని, ఎంట్రీ సీన్‌లో జూనియర్ ఎన్టీఆర్ యోగా చేశాడు. అసలు ఎన్టీఆర్ దుమ్ములేపేశాడు.. రామ్ చరణ్ ఇంత బాగా నటిస్తాడని అనుకోలేదంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెట్టడంతో తారక్, చరణ్ ఫాన్స్ ఎక్కడా ఆగడం లేదు. రాజమౌళి మార్క్ ఎలివేషన్‌తో ఇంటర్వెల్ సీన్ పిచ్చెక్కింది. ఇంటర్వెల్ సీన్‌కు థియేటర్లో బాక్సులు బద్దలవ్వకుంటే ఒట్టు.. అగ్గిపెట్టేశారు.. ఊహించని ట్విస్టులెన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు, కామన్ ఆడియన్స్‌కు పూనకాలే అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ట్వీట్ చేసారు. 

సెకండాఫ్‌లో ఒక పర్టిక్యులర్ సీన్ మైండ్ బ్లోయింగ్‌గా అంటూ.. ఇంకా నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. రాజమౌళికి దండాలు పెట్టాలి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండుగే అంటూ మరో నెటిజెన్ ట్వీట్ చేసారు. యంగ్ టైగర్ బ్రాండ్ మరో లెవెల్‌కు వెళ్తుంది. ఫ్యాన్స్‌కు పూనకాలే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కెరీర్‌లో ఇదే బెస్ట్ ఎంట్రీ, పర్ఫెక్ట్ పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చారు చరణ్ అండ్ తారక్ అంటూ మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు. రాజమౌళి కష్టానికి తగ్గ ఫలితం ట్రిపుల్ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యి ఆయన్ని మరో లెవల్లో నించోబెట్టడం ఖాయమని, ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ మూడేళ్ళ కష్టానికి తగిన ఫలితం దక్కింది అంటూ ట్రిపుల్ ఆర్ చూసిన ప్రేక్షకులు తమ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు.

RRR Premiers show talk:

NTR - Ram Charan RRR Overseas show talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ