Advertisementt

ఫ్యామిలీ తో ట్రిపుల్ ఆర్ ప్రీమియర్ కి తారక్

Thu 24th Mar 2022 11:05 PM
young tiger ntr,ntr and family,amb,hyderabad,rrr premiere,ntr,lakshmi pranathi,ntr sons,bhargav ram,mahesh amb mall,abhay ram  ఫ్యామిలీ తో ట్రిపుల్ ఆర్ ప్రీమియర్ కి తారక్
Young Tiger NTR and family spotted at AMB ఫ్యామిలీ తో ట్రిపుల్ ఆర్ ప్రీమియర్ కి తారక్
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్, ట్రిపుల్ ఆర్, ట్రిపుల్ ఆర్ ఇప్పుడు ఈ క్షణం ఎవ్వరి నోట చూసినా ఇదే మాట, మీకు టికెట్స్ వచ్చాయా, మీకు టికెట్స్ దొరికాయా, మాకు టికెట్స్ ఉంటే ఇస్తారా.. ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసెయ్యాలి.. ఇది ఇప్పుడు యూత్ కాదు.. సాధారణ ఆడియన్స్ ముందు ఉన్న గోల్. ట్రిపుల్ ఆర్ బెన్ఫిట్ షోస్ కే చిన్న పిల్లలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. చిన్న పిల్లలు కూడా మామ ట్రిపుల్ ఆర్ టికెట్స్ వచ్చాయా అంటూ అడుగుతున్నారు. ఫాన్స్, ఆడియన్స్ మ్యానియా అలా ఉంటే.. హైదరాబాద్ లో ఫస్ట్ షో(బెన్ఫిట్ షో) 3.03 నిమిషాలకు అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైపోయింది. 

కానీ ట్రిపుల్ ఆర్ టీం ఈ రోజు 24 రాత్రి 9 గంటలకే మహేష్ AMB లో స్పెషల్ ప్రీమియర్స్ చూసేస్తున్నారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న AMB మాల్ లో రాజమౌళి సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల కోసం స్పెషల్ ప్రీమియర్స్ వేయించగా.. అక్కడికి ట్రిపుల్ ఆర్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి, కొడుకులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లు AMB మాల్ లో ట్రిపుల్ ఆర్ ని వీక్షించేందుకు వచ్చినప్పుడు ఫోటో గ్రాఫర్స్ క్లిక్ మనిపించిన ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Young Tiger NTR and family spotted at AMB:

Young Tiger NTR and family spotted at AMB, Hyderabad for RRR premiere

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ