కోలీవుడ్ లో గత శుక్రవారం ప్రముఖ హీరో కారు ఓ వ్యక్తిని గుద్దడంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో సదరు హీరో డ్రైవర్ ని పోలీస్ లు అరెస్ట్ చెయ్యడం చెన్నై లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉండి.. ఈమధ్యనే మనాడు సినిమాతో మళ్ళీ క్రీజ్ లోకి వచ్చిన హీరో శింబు కారు డ్రైవర్ ని అరెస్ట్ చెయ్యడం కలకలం సృష్టించింది. ఇంతకీ విషయం ఏమిటి అంటే చెన్నైలోని ఎలాంగో సలై పోయెస్ రోడ్ జంక్షన్ లో మార్చి 18న జరిగిన యక్షడెంట్ ఇప్పుడు చెన్నై మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అది కూడా వారం తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే అక్కడ హీరో శింబు డ్రైవర్ కావడం తో ఇప్పుడు మీడియా ఫోకస్ మొత్తం దాని మీదకి డైవర్ట్ అయ్యింది.
అయితే మార్చ్ 18 న శింబు డ్రైవర్ చెన్నైలోని ఎలాంగో సలై పోయెస్ రోడ్ జంక్షన్ లో మునుస్వామి అనే 70 ఏళ్ళ వ్యక్తిని గుద్దడంతో తీవ్ర గాయాలు పాలైన అతన్ని అంబులెన్సు లో ఆసుపత్రికి తరలించగా.. అతను చికిత్స పొందుతూ మరణించాడట. కారు శింబు పేరు మీద రిజిస్టర్ కావడంతో శింబు డ్రైవర్ ని పోలీస్ లు అరెస్ట్ చెయ్యడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ యాక్సిడెంట్ లో శింబు పేరు బయటికి రావడంతో ఈ విషయం మీద మీడియా కూడా గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసుకున్న చెన్నైలోని పాండీ బజార్ పోలీసులు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.