ఈ ఏడాది మొదట్లో తాము విడిపోతున్నట్లుగా ప్రకటించి షాకిచ్చారు రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ లు. 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి విడాకులు అనే కాన్సెప్ట్ తో ఫుల్ స్టాప్ పెట్టింది ఈ జంట. ధనుష్, ఐశ్వర్యాలు విడివిడిగా సోషల్ మీడియాలో విడాకుల ప్రకటన ఇచ్చినా ఐశ్వర్య మాత్రం తన పేరు పక్కన ధనుష్ ని తియ్యకుండా సోషల్ మీడియాలో అలానే ఉంచేసింది. తర్వాత ధనుష్ తరచూ పిల్లతో స్పెండ్ చెయ్యడం, అలాగే ఐశ్వర్యం ధనుష్ లు హైదరాబాద్ లో స్టే చెయ్యడంతో.. చాలామంది వీళ్ళు కలిసిఉండే అవకాశం ఉంది అనుకున్నారు. అలాగే రజినీకాంత్, ధనుష్ ఫ్యామిలీ కూడా వీళ్ళ మధ్యన ప్యాచప్ చెయ్యడానికి ట్రై చేస్తుంది.. సో కలిసి పోతారేమో ధనుష్ - ఐశ్వర్య అనుకున్నారు.
కానీ అలాంటిదేం కనిపించలేదు. రీసెంట్ గా ఐశ్వర్య తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి తన పేరు పక్కన ధనుష్ పేరుని తొలగించింది. ఐశ్వర్య పేరు చివరన తన తండ్రి సుపోర్ స్టార్ రజనీకాంత్ పేరును పెట్టుకుంది. ఐశ్వర్య అలా చెయ్యడంతో ఇకపై ధనుష్ ను మళ్లీ కలిసే అవకాశమే లేదని ఆమె స్పష్టంగా.. ఈ రకంగా చెప్పినట్టయింది. ఇక ధనుష్ తన చిత్రాల షూటింగ్స్ తో బిజీ కాగా.. ఐశ్వర్య కూడా దర్శకత్వం పై దృష్టి పెట్టింది.