ట్రిపుల్ ఆర్ గత ప్రమోషన్స్ లో అక్కడక్కడా కనిపించిన రాజమౌళి తండ్రి, ట్రిపుల్ ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. కేవలం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్ని ఈవెంట్స్ ని, ఇంటర్వూస్ ని కవర్ చేసారు కానీ.. ఆయన ఎక్కడా కనిపించలేదు. అయితే తాజాగా ఆయన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ట్రిపుల్ ఆర్ మూవీ హైలెట్స్ ని రివీల్ చేసేసారు. అందులోను తారక్, చరణ్ ల పాత్రలపై ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారాయన.
అందులో తారక్, చరణ్ లు ఇద్దరూ సినిమాలో ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత ప్రాణ స్నేహితుల్లా కనిపిస్తారని, ఈ కథలో తారక్, చరణ్ ల ఐడియాలజీ వేరు. సినిమా స్టార్టింగ్ లోనే ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధృవాలు అన్న విషయం తెలుస్తుంది. హీరోలిద్దరూ వేరు వేరు స్వభావాలు ఉన్న వాళ్లు కావడంతో వీళ్ళ మధ్యలో గొడవ వస్తుంది అని ఆడియన్స్ అనుకుంటారు. అప్పుడలా జరగకూడదని ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ ట్రిపుల్ ఆర్ ఇంటర్వెల్ ముందు ఇద్దరూ సింహాల్లా కలబడతారు. అది చూస్తే ఫాన్స్ కి మాత్రమే కాదు ప్రేక్షకులకి ఏడుపు వస్తుంది.. అంటూ సినిమాలోని మెయిన్ హైలెట్స్ ని రివీల్ చేసారు.