ట్రిపుల్ ఆర్ టీం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ పెట్టేసి.. అక్కడి నుండి దుబాయ్ కి, తర్వాత చిక్ బళ్లాపూర్, తర్వాత వారణాసి, ఢిల్లీ, అమృత్ సర్.. చివరికి హైదరాబాద్ లోనే అందరి నటుల మాదిరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటేసారు ట్రిపుల్ ఆర్ హీరోలు, దర్శకుడు. అలాగే రానా, అనిల్ రావిపూడి, సందీప్ వంగా, సుమ తో ట్రిపుల్ ఆర్ ఇంటర్వ్యూలు చేసారు. ఆయా భాషల్లో పాపులర్ కామెడీ షోస్, అలాగే టాప్ టాక్ షోస్ లో పాల్గొన్నారు. అయితే ఇంత చేసిన ట్రిపుల్ ఆర్ టీం గనక మరొక్కటి చేసుంటే.. ఆ క్రేజ్, ఆ హైప్ మాములుగా ఉండేది కాదు.
అదేమిటంటే ఆహా అన్ స్టాపబుల్ షో లో ట్రిపుల్ ఆర్ టీం పాల్గొని బాలయ్య తో క్రేజీ ఇంటర్వ్యూ, టాక్ షో, అలాగే గేమ్ షో చేసుంటే మరింతగా హైప్ ఉండేది. నెంబర్ వన్ టాక్ షో గా బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కి క్రేజ్ వచ్చింది. అలాంటిది టాక్ షో లో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి కలిసి పాల్గొని ఉంటే.. ఆ క్రేజ్ నందమూరి అభిమానులని నిలవనిచ్చేది కాదు. రాజమౌళి - కీరవాణి తో కలిసి ఆహా షో లో పాల్గొన్నారు కానీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో వచ్చి ఉంటే నిజంగా ఆహా అనేవారు. బాలయ్య తో ఎన్టీఆర్ మాట్లాడుతుంటే ఆహా నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోయేవి కావు. అటు ఎన్టీఆర్ ఇటు నందమూరి ఫాన్స్ కూడా ఖుషీగా ఫీలయ్యేవారు.