డిసెంబర్ లో రాజమౌళి ట్రిపుల్ ఆర్ కి చేసిన ప్రమోషన్స్ చూసి.. అమ్మో అనుకున్నారు. మళ్ళీ ఇంతగా ఆయన ప్రమోషన్స్ చెయ్యగలరా అన్నారు. కానీ రాజమౌళి అంతకు మించి అనేలా చేసి చూపించారు. డిసెంబర్ లో చేసిన ప్రమోషన్స్ కి మించి ట్రిపుల్ ఆర్ ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లి అంచనాలు పెంచేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ విడివిడిగా వస్తేనే ఆ సినిమాపై విపరీతమైన హైప్ ఉంటుంది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తో కలిసి రాబోతున్నారు. మరా సినిమాపై ఎన్ని అంచనాలుండాలి, ఎంత హైప్ వచ్చి ఉండాలి. ప్రేక్షకుల్లో, ఫాన్స్ లో ఉన్న ఆ అంచనాలను ట్రిపుల్ ఆర్ రీచ్ అవుతుందా? లెక్కకు మించి బిజినెస్ చేసిన ట్రిపుల్ ఆర్ కి అన్ని కోట్లు వస్తాయా? అన్ని భాషల ఆడియన్స్ ట్రిపుల్ ఆర్ ని ఆదరిస్తారా? తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్, చరణ్ కి ఉన్న క్రేజ్ ఇతర భాషల్లో ఉందా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.
ఇప్పటి వరకు సక్సెస్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి అదే సక్సెస్ మంత్రాని ట్రిపుల్ ఆర్ తో కొనసాగిస్తారా? ట్రిపుల్ ఆర్ ఫలితం అటు ఇటుగా అయితే మాములుగా ఉండదు, కానీ రాజమౌళి పై నమ్మకం, ఆయనపై పెట్టుకున్న అంచనాలు అన్ని నిజమవుతాయనే ఆశతో ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఫాన్స్, ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను ట్రిపుల్ ఆర్ ఏ మాత్రం, ఎంతవరకు రీచ్ అవుతుందో ఈ రోజు మిడ్ నైట్ కల్లా ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ తో తేలిపోవడం ఖాయం.