Advertisementt

కెజిఎఫ్ ని లైక్ చేస్తున్న రామ్ చరణ్

Wed 23rd Mar 2022 09:08 PM
ram charan,kgf 1,dheera dheera song,rrr interviews,prashanth neel,yash  కెజిఎఫ్ ని లైక్ చేస్తున్న రామ్ చరణ్
Ram Charan about Dheera dheera song from KGF కెజిఎఫ్ ని లైక్ చేస్తున్న రామ్ చరణ్
Advertisement
Ads by CJ

ప్రశాంత్ నీల్ యశ్ హీరోగా కెజిఎఫ్ ని తెరకెక్కించి టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసినా ఎవ్వరిలో ఎలాంటి హైప్, ఇంట్రెస్ట్ లేదు. సినిమా రిలీజ్ అయ్యిన మూడు నాలుగు రోజుల వరకు కెజిఎఫ్ మాట వినిపించలేదు. కానీ తర్వాత నుండి కెజిఎఫ్ మూవీ కి పాజిటివ్ టాక్ కాదు మాస్ టాక్ కి ఆడియన్స్ తో పాటుగా స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ లాంటి వారు పడిపోయారు. కెజిఎఫ్ 2 రిలీజ్ కాకుండానే ప్రశాంత్ నీల్ తో సినిమాలు చెయ్యడానికి ఎన్టీఆర్, ప్రభాస్ రెడీ అయ్యారు. ప్రభాస్ అయితే అప్పుడే సలార్ తో సెట్స్ మీదకెళ్ళిపోయారు. ఇక తరవాత ఎన్టీఆర్ తో మూవీ లైన్ లో ఉంది. ఈలోపు ప్రశాంత్ నీల్ మెగా కంపౌండ్ లో మెరిశారు.

అప్పట్లో అదో సెన్సేషన్ అయ్యింది. అయితే తాజాగా రామ్ చరణ్ మీరు నటించిన ఏ సినిమాల్లో ఇంకా బాగా చేస్తే బావుంటుంది అనుకుంటున్నారు అని అడిగితే.. వినయ విధేయరామ అంటూ జవాబు చెప్పారు. రామ్ చరణ్ కెరీర్ లో వినయ విధేయ రామ్ డిజాస్టర్ మూవీ గా నిలిచింది అని తెలిసిందే. అయితే మీకు ఓ బ్యాగ్రౌండ్ సాంగ్ కావాలి అంటే ఎలాంటి సాంగ్ కోరుకుంటారు అని చరణ్ ని అడిగితే.. కెజిఎఫ్ లో ధీరా, ధీర సాంగ్ లాంటిది కావాలి అన్నారు. అంటే కెజిఎఫ్ కి రామ్ చరణ్ ఎంతగా ఫిదా అయ్యారో.. హీరో యశ్ ఎలివేషన్ సీన్స్ కి ఎంతగా ఇంప్రెస్స్ అయ్యారో అర్ధమవుతుంది. 

Ram Charan about Dheera dheera song from KGF :

Ram charan on KGF 1 Dheera Dheera Song