ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. గతంలో మార్చి నెలలో ఇంత ఎండలు ఉండేవి కావు. కానీ ఈసారి మార్చ్ 1st నుండే ఎండాకాలం వచ్చేసింది. ఎండలతో సర్రుమంటుంది. ఏసీలో ఉన్నంత సేపు కూల్ గానే ఉంటున్నా బయట కాలు పెడితే చమటలు, వేడి, ఎండ తో జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడొక తార మరోసారి వింటర్ వస్తే బావుంటుంది అంటూ తను వింటర్ లో స్వెట్టర్ వేసుకుని బయట ఎంజాయ్ చేస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆమె ఎవరో కాదు బ్యూటిఫుల్ పూజ హెగ్డే. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజ హెగ్డే కి పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ బ్రేకులు వేసింది. రాధే శ్యామ్ పూజ హేగ్డ్ కి అట్టర్ ప్లాప్ ని కట్టబెట్టింది. ఆ సినిమా ప్లాప్ అయినా, అందులో కనిపించిన పూజ హేగ్డ్ పై విమర్శకులు విరుచుకుపడ్డారు. రాధే శ్యామ్ ఫలితం విధి రాత అంటూ స్పందించిన పూజ హెగ్డే తాజాగా సోషల్ మీడియాలో తాను వింటర్ లో స్వెట్టర్ వేసుకుని ఎంజాయ్ చేస్తున్న పిక్ షేర్ చేస్తూ.. Can it be winter again please 🥺❄️⛄️again అంటూ క్యాప్షన్ పెట్టింది.