Advertisementt

నయన్ - విగ్నేష్ పై కేసు నమోదు

Wed 23rd Mar 2022 07:06 PM
vignesh shivan,nayanthara police case,nayan and vignesh,kannan  నయన్ - విగ్నేష్ పై కేసు నమోదు
Nayanthara, Vignesh Shivan in trouble? నయన్ - విగ్నేష్ పై కేసు నమోదు
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా నయనతార - విగ్నేష్ శివన్ లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నారు. ఎందుకంటే వారిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అని, అలాగే రీసెంట్ గా నయనతార తల్లి అవ్వాలనుకుంటుంది.. దాని కోసం సరోగసి మదర్ ని అప్రోచ్ అవుతున్నారంటూ ఏవేవో కథనాలు వాళ్ళ పెళ్లి పై ప్రసారం అవుతున్నాయి. అయితే ఇలాంటి టైం లో నయనతార - విగ్నేష్ శివన్ ల పై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. వాళ్ళు ఏర్పాటు చేసిన రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థని, అలాగే దానిని స్థాపించిన విగ్నేష్ శివన్, నయనతారని అరెస్ట్ చెయ్యాలంటూ తమిళనాడుకు కి చెందిన సోషలిస్టు కణ్ణన్ అనే వ్యక్తి చెన్నై పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే కణ్ణన్ ప్రస్తుతం తమిళనాడులో రౌడీలని అణిచివేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సమయంలో నయన్ ఇంకా విగ్నేష్ లు ఇలా రౌడీ పిక్చర్స్ అంటూ రౌడీలని ప్రోత్సహించేదిలా ఆ నిర్మాణ సంస్థ ఉంది అని.. నయన్ - విగ్నేష్ లు రౌడీలని ప్రోత్సహిస్తున్నారు అంటూ వాళ్లపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పటివరకు చిన్న సినిమాలని నిర్మించిన రౌడీ పిక్చర్స్ ఇప్పుడు స్టార్ హీరో అజిత్ తో ఓ సినిమా అనౌన్స్ చేసిన టైం లో ఇలా జరగడం అనేది నయన్, విగ్నేష్ ఫాన్స్ ని కలవర పరుస్తుంది. 

Nayanthara, Vignesh Shivan in trouble? :

Police case filed against Vignesh Shivan and Nayanthara

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ