ప్రస్తుతం తారక్ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా తారక్ ఓ ఇంటర్వ్యూలో ట్రిపుల్ ఆర్ విషయాలనే కాకుండా.. ఇంకా చాలా విషయాలను పంచుకున్నారు. అందులో తన ఫోన్ లో ఎక్కువగా ప్లే అయ్యే సాంగ్ ఆశాపాశం సాంగ్ అని చెప్పారు. అలాగే మీ సినిమాల్లో ఏ సినిమాకి సీక్వెల్ చేస్తే బావుంటుంది అని అనుకుంటున్నారని అనగానే అదుర్స్ అన్నారు. ఇంకా ఫ్యూచర్ లో మీరు ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలనుకుంటున్నారు అని అడిగితే తారక్ మరు నిమిషం రాజమౌళి పేరే చెప్పారు.
అలాగే మీరు ఎమెర్జెన్సీ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తారు అంటే.. నా వైఫ్ ప్రణతికి అని చెప్పిన తారక్.. మీరు ఓ ఐలాండ్ లో ఇరుక్కున్నప్పుడు.. అక్కడికి మీతో పాటు మరో ముగ్గురు ఇండస్ట్రీ వ్యక్తులని ఎంచుకుని ఉంచుకోవాలంటే ఎవరిని చూజ్ చేసుకుంటారని అడిగితే.. ఒకరు చరణ్, మరొకరు రానా అని చెప్పిన తారక్.. ఇంకొకరిని కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పేరు చెప్పడం కొత్తగా అనిపించింది.