పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ థియేటర్ రన్ ముగిసింది. భీమ్లా నాయక్ రిలీజ్ అయిన నెల రోజులకే ఆ సినిమా ఓటిటి నుండి ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. ఫిబ్రవరి 25 న రిలీజ్ అయ్యి థియేటర్స్ దుమ్ముదులిపి బాక్సాఫీసు షేక్ చేసిన భీమ్లా నాయక్ ఇప్పుడు మీ ఇంట్లోనే.. అది కూడా ఒక రోజు ముందే అంటూ రెండు బడా ఓటిటి సంస్థలు ఊదరకొట్టేస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా ఓటిటి నుండి రేపు అంటే మార్చ్ 24 నే రిలీజ్ కాబోతున్న భీమ్లా నాయక్ క్లోజింగ్ కలెక్షన్స్ మీ కోసం..
ఏరియా కలెక్షన్స్(కోట్లలో)
నైజాం - 35.00
సీడెడ్ - 11.20
ఉత్తరాంధ్ర - 7.66
ఈస్ట్ గోదావరి - 5.54
వెస్ట్ గోదావరి - 5.13
గుంటూరు - 5.30
కృష్ణా - 4.25
నెల్లూరు - 2.83
ఏపీ, తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్ - 76.91 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక - 8.28
ఓవర్సీస్ -12.65
వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్: 98.20 కోట్లు