టాప్ 5 కి వెళతాడనుకున్న ఆర్ జె చైతు ఎలిమినేట్ అవడం ఏమిటో? కెప్టెన్ అయిన వ్యక్తిని ఎలిమినేట్ చెయ్యడం ఏమిటో? ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న మాత్రమే కాదు.. ఎలిమినేట్ అయిన ఆర్జే చైతు కూడా ఇదే ఫీలవుతున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నాగార్జున గారు చైతు మీరు ఎలిమినేట్ అనగానే నాకు కళ్ళలో నీళ్లు వచ్చేసాయి. కళ్ళకి గంతలు కట్టి తీసుకు వచ్చేటప్పుడు నన్ను సీక్రెట్ రూమ్ కి పంపుతారమేమో అని ఆశ పడ్డాను. కానీ వారు మాత్రం మీరు ఎలిమినేట్ అయ్యారనగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేనెందుకు ఎలిమినేట్ అయ్యాను, నేను ఉండాల్సిన స్థానంలో నన్ను ఎందుకు తీసేసారు. ఇలాంటి ఆలోచనలతో రోజూ బిగ్ బాస్ ని తలచుకుని ఏడుస్తున్నాను.
నేనేమి బ్యాడ్ కంటెస్టెంట్ ని కాదు, కష్టపడి కెప్టెన్ అయ్యాను. నాకు ఓట్స్ ఎందుకు పడలేదు. నేను నాగార్జున గారిని అడిగాను. నన్నెందుకు ఎలిమినేట్ చేసారు అని, మీకు ఓట్స్ పడలేదు అని ఆయన అన్నారు. అదేమిటి నేను గేమ్ సరిగ్గానే ఆడాను కదా.. నాకు ఓట్స్ ఎందుకు వెయ్యలేదు. నాపై ఎలాంటి నెగెటివిటి కూడా లేదు. అలాంటిది నేను ఎలిమినేట్ ఎందుకయ్యానో అర్ధం కాక చాలా ఏడ్చాను. నేను టాప్ 5 వరకు ఉంటాను అనుకున్నా.. నేను వెళుతుంటే నాగ్ సర్ పిలుస్తారేమో అనుకున్నా. కానీ అలా ఏం జరగలేదు. నేను ఏడేళ్ల తర్వాత అంతలా ఏడ్చింది మళ్ళీ ఇప్పుడే. ఇంట్లో కూడా ఉదయం లేవగానే మైక్ కోసమే వెతుకుంటున్నాను.. అంతలా బిగ్ బాస్ లో అలవాటైంది నాకు అంటూ చెప్పుకొచ్చాడు.