Advertisementt

ట్రిపుల్ ఆర్ బుకింగ్స్ పై టికెట్ రేట్స్ ఎఫెక్ట్

Wed 23rd Mar 2022 09:37 AM
rrr,hyderabad,bookmyshow,rrr movie,book my sho tickets  ట్రిపుల్ ఆర్ బుకింగ్స్ పై టికెట్ రేట్స్ ఎఫెక్ట్
Ticket rates effect on RRR booking ట్రిపుల్ ఆర్ బుకింగ్స్ పై టికెట్ రేట్స్ ఎఫెక్ట్
Advertisement
Ads by CJ

అసలు సిసలైన పాన్ ఇండియా మూవీ రాబోతుంది. దానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ శుక్రవారం థియేటర్స్ లోకి గ్రాండ్ గా భారీ ప్రమోషన్స్ తో అడుగుపెట్టబోతుంది. రేపు అర్ధరాత్రి నుండే ట్రిపుల్ ఆర్ ప్రీమియర్స్ షో టాక్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోవడానికి రెడీ అయ్యింది. కరోనా తో రెండేళ్ల సమయాన్ని వృధా చేసుకున్న ట్రిపుల్ ఆర్.. భారీ సక్సెస్ సాధించడానికి ఆకలి మీదుంది. మరోపక్క తమ హీరోలని మూడేళ్ళ అర్వాత చూడబోతున్నామన్న ఆత్రుత ఉంది. అంత ఉన్న ట్రిపుల్ ఆర్ బుకింగ్స్ లో చాలా నీరసంగా కనిపిస్తుంది. మొదటి రోజు బుక్ మై షో లో సోల్డ్ అవుట్ బోర్డు కనిపించినా.. శని, ఆదివారాల్లో ట్రిపుల్ టికెట్స్ బుకింగ్ లో ఊపు కనిపించడం లేదు. 

బయట ఉన్న క్రేజ్ సినిమా రిలీజ్ టైం కి ఎందుకు లేదో చాలామందికి అర్ధం కాకపోయినా.. ట్రిపుల్ ఆర్ చూడాలనే కోరిన ఉన్నా ఆ సినిమాకి పెంచేసిన టికెట్ రేట్స్ చూసిన సామాన్య మానవుడు ట్రిపుల్ ఆర్ మూవీ కి ఫ్యామిలీ తో కలిసి వెళ్ళాలి అంటే మూడు నాలుగు వేలు కావాలి. అసలే కోవిడ్ టైం. ఇంకా సరిగ్గా పనులు లేక ఇబ్బంది పడుతున్నాం.. ఇలాంటి టైం లో మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టే స్తొమత లేదు ఇది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ముందు ఉన్న పెద్ద సవాల్. కోవిడ్ టైం లో నిర్మాత వడ్డీలతో నష్టపోయాడు. అది కరెక్ట్. అలాగని సామాన్య ప్రేక్షకుడిపై టికెట్ భారం మోపి లాభాలు తెచ్చుకోవాలంటే కష్టం కదా.. నిర్మాత సేఫ్ అవ్వాలనే ప్రేక్షకులు నష్టపోవాలి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విషయంలో అదే కనబడుతుంది. 

తెలంగాణాలో టికెట్ రేట్స్ చూసి ఆడియన్స్ అదిరిపోతున్నారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు బుక్ మై షో టికెట్స్ పై పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. ట్రిపుల్ ఆర్ పై ఉన్న క్రేజ్ టికెట్ రేట్స్ చంపేస్తున్నాయి. సినిమా చూడాలన్న ఆత్రుత, ఆశ టికెట్ రేట్స్ కారణంగా నీరుగారిపోతుంది. 

Ticket rates effect on RRR booking:

RRR - in Hyderabad - BookMyShow

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ