ఈమధ్యన జబర్దస్త్ కి గడ్డుకాలం మొదలైంది. ఎందుకంటే చాలామంది కమెడియన్స్ జబర్దస్త్ కి బై బై చెప్పేసారు. దానితో ఏదో స్పెషల్ స్కిట్స్ తో లాగించేస్తున్నారు. ఆఖరికి జెడ్జెస్ కూడా స్టేజ్ పైకి వచ్చి స్కిట్స్ చేసుకుంటున్నారు. కమెడియన్స్ లేక జబర్దస్త్ లో జోష్ తగ్గింది. దానికి తగ్గట్టుగా రేటింగ్ తగ్గింది. అయితే ఇప్పడు జబర్దస్త్ కమెడియన్స్ పారితోషకాలు తగ్గించినట్టుగా తెలుస్తుంది. ఒకప్పుడు టాప్ టీం కి మూడు లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చే మల్లెమాల యాజమాన్యం.. ఇప్పుడు 2 నుండి 2.5 లక్షలు మాత్రమే ఇస్తుందట. జేడ్జ్ రోజాకి మాత్రం ఆమె పారితోషకం తగ్గించకుండా ఎప్పటిలాగే యాజిటీజ్ గా ఇస్తున్నారట. కారణం రోజా వలనే జబర్దస్త్ నడుస్తుంది అని. అందుకే రోజాకి తగ్గించకుండా కమెడియన్స్ పారితోషకాల్లో కోత పెట్టారని తెలుస్తుంది.
సుడిగాలి సుధీర్ దగ్గర నుండి, హైపర్ ఆది వరకు, కెవ్వు కార్తిక్ నుండి బుల్లెట్ భాస్కర్ వరకు పారితోషకాల్లో కోత పెట్టడంతోనే.. చాలామంది కమెడియన్స్ వేరే ఛానల్స్ కి పోయారని, సుధీర్ కూడా పక్క ఛానల్స్ కి ఈవెంట్స్ చేసుకోవడానికి వెళ్లిపోయాడని, కండిషన్స్ పెట్టడం మానేసిన మల్లెమాల పారితోషకాల్లో కోత పెట్టడం వలనే ఇలా జరిగింది అని, అడిగితె రేటింగ్ పెంచండి రేటు పెరుగుతుంది అంటూ మల్లెమాల యాజమాన్యం చెబుతుందట. టిఆర్పి రేటింగ్ పెరిగితే ఆటోమాటిక్ గా మీ పారితోషకాలు పెరుగుతాయని చెప్పారని తెలుస్తుంది. మరి జబర్దస్త్ స్కిట్స్ లో కొత్తగా స్క్రిప్ట్స్ రాసుకుని కొత్తగా కామెడీ చేస్తేనే లేదంటే లేదు.