రాజమౌళి ఎన్ని రకాలుగా సినిమాని ప్రమోట్ చెయ్యాలో అన్ని రకాలుగా ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ అంటూ కీరవాణి, సుమ కనకాల, అలాగే అనిల్ రావిపూడి తో ఇంటర్వూస్ చేసారు. అయితే గత ప్రమోషన్స్ లో రాజమౌళి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి కూడా వెళ్లి ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చేసారు. ఇక వేరే భాషల్లోనూ ఆయా పాపులర్ టివి షోస్, యూట్యూబ్ షోస్ లో, జొమాటో లలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ట్రిపుల్ ఆ ర్ ని ప్రమోట్ చేస్తూ మొత్తం మీడియా, సోషల్ మీడియా అటెంక్షన్ అంతా ట్రిపుల్ ఆర్ మీదే ఉండేలా జక్కన్న ప్లాన్ చేసారు. మార్చ్ 25 సినిమా విడుదలయ్యే వరకు ఆడియన్స్ అంతా ట్రిపుల్ ఆర్ ముచ్చట్లే మాట్లాడుకునేలా ఎడా పెడా సినిమాని ప్రమోట్ చేసేస్తున్నారు.
అయితే తెలుగులో చిన్న సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాల ప్రమోషన్స్ కి చాలామంది నటులు బుల్లితెర మీద పాపులర్ అయిన జబర్దస్త్, ఢీ షోస్ కి వెళుతుంటారు. జబర్దస్త్ కి ఈ మధ్యనే శేఖర్ హీరో రాజశేఖర్, గతంలో హీరో నాని, సిద్దు జొన్నలగడ్డ, వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు వచ్చి సినిమాలని ప్రమోట్ చేసుకున్నారు. మరి రాజమౌళి అండ్ ఎన్టీఆర్ అండ్ చరణ్ లు ఢీ కి, జబర్దస్ కి కూడా వచ్చేసి ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చేసి ఉంటే బుల్లితెర ఆడియన్స్ కూడా సర్ ప్రైజ్ అయ్యేవారే.. అయ్యో జక్కన్న జబర్దస్త్ ని ఢీ ఎందుకు వదిలేశావయ్యా అంటూ ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ అడుగుతున్నారు.