Advertisementt

ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యా యత్నం

Tue 22nd Mar 2022 04:41 PM
jr ntr,ntr fan tarak fan,suicide attempt,rrr posters,rrr cutouts,rrr banners,ram charan fans  ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యా యత్నం
NTR fan suicide attempt ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యా యత్నం
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మ్యానియాతో ఎన్టీఆర్ ఫాన్స్, రామ్ చరణ్ ఫాన్స్ వెర్రి అభిమానంతో కొట్టేసుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ విడుదలకు దగ్గరయ్యే కొలది ఫాన్స్ లో టెంక్షన్ పెరిగిపోతుంది. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ లు ఎంతగా చెప్పినా ఫాన్స్ లో మార్పు రావడం లేదు. ఏ హీరోకి ఎంత ఇంపార్టెన్స్ అనేది పక్కబెట్టి సినిమా చూడమని చెబుతుంటే.. వాళ్లేమో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పోటీ పడుతున్నారు. రీసెంట్ గా జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే జై ఎన్టీఆర్, జై చరణ్ అంటూ జెండాలతో రచ్చ రచ్చ చేసారు. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ కి దగ్గర పడడంతో ఏపీ, తెలంగాణలోని అన్ని థియేటర్స్ లో అభిమానులు థియేటర్స్ దగ్గర రచ్చ మొదలు పెట్టారు. 

చరణ్ బ్యానెర్లు, ఎన్టీఆర్ కటౌట్స్ కట్టడానికి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోదాడలోని ఓ థియేటర్ వద్ద ఎన్టీఆర్, చరణ్ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్టీఆర్ ఫ్లెక్సీ కడుతుండగా.. చరణ్ ఫాన్స్ అడ్డుకుని తోసెయ్యడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఎన్టీఆర్ అభిమాని ఒంటిపై పెట్రోల్ పోసుకుని సుయిసైడ్ చేసుకోబోయాడని, అంతలో పక్కన ఉన్నవారు అలర్ట్ అయ్యి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది అని తెలుస్తుంది. అక్కడ ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడమే కాకుండా ఇరువురి ఫాన్స్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 

NTR fan suicide attempt:

Jr NTR fan suicide attempt @ RRR poster issue

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ