రాజమౌళి తో సినిమా చేస్తే ఏ హీరో కైనా హిట్ పడాల్సిందే. అంతలాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఆయన. అందుకే రాజమౌళితో సినిమాలు చెయ్యడానికి హీరోలు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. కానీ రాజమౌళి తన కథకి ఎవరు సరిపోతారో వారినే చూజ్ చేసుకుంటారు కానీ.. హీరోలు అడిగారని ఆయన సినిమా చెయ్యరు. అయితే రాజమౌళి తో సినిమా చేసి హిట్ కొట్టిన హీరోలకి తదుపరి ఒకటి రెండు ప్లాప్స్ అనేది ఓ సెంటిమెంట్ గా మారిపోయింది. రాజమౌళి ఎన్టీఆర్ తో మొదటి సినిమా చేసినప్పటి నుండి ఈ సెంటిమెంట్ కి హీరోలు బలవుతున్నారు. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆఖరికి సునీల్.. నిన్నగాక మొన్నొచ్చిన బాహుబలి తో ప్రభాస్ కూడా. బాహుబలి తో ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ కొట్టి తర్వాత పాన్ ఇండియా లోనే రెండు వరస ప్లాప్స్ కొట్టారు.
బాహుబలి 1, బాహుబలి 2 తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. నార్త్ లోనూ ప్రభాస్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. కానీ సాహో తో నార్త్ లో సక్సెస్ అయినా మిగతా అన్ని భాషల్లో ప్లాప్ అయ్యారు. ఇక రీసెంట్ గా రాధే శ్యామ్ తో ప్రభాస్ కి మాములు డిజాస్టర్ పడలేదు. రాధే శ్యామ్ విడుదలైన అన్ని భాషల్లో ప్లాప్ అయ్యింది. మరి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గనక బ్లాక్ బస్టర్ అయితే తదుపరి ఎన్టీఆర్, రామ్ చరణ్ కి ప్లాప్స్ పడతాయని ఫాన్స్ కంగారు పడుతున్నారు. ట్రిపుల్ ఆర్ తో వచ్చిన క్రేజ్, హైప్ మొత్తం ఆ ప్లాప్ ల్లో కొట్టుకుపోతాయి.. రాజమౌళి సెంటిమెంట్ కి ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా బలవుతారని ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ లో.. లోపల గుబులు పడుతున్నారు. ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ అటు తర్వాత కొరటాలతో ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీస్ చెయ్యబోతున్నారు. ఇక రామ్ చరణ్ శంకర్ తోనూ, గౌతమ్ తిన్ననూరి తో తదుపరి చిత్రాలు చేస్తున్నారు. అవి కూడా సక్సెస్ అవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.