మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి టాపిక్ ఎప్పటికప్పుడు మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది. ఎందుకంటే వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి తో ప్రేమలో ఉన్నాడంటూ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. లావణ్య బర్త్ డే అప్పుడు, వరుణ్ బర్త్ డే అప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి టాపిక్ మీడియాలో వినిపిస్తుంది. గతంలో నాగబాబు కూడా వరుణ్ కి సంబంధాలు చూస్తున్నాం.. కానీ వాడే వద్దంటున్నాడు అంటూ చెప్పారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తాను నటించిన గని ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. మరోపక్క వరుణ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 మూవీ చేసాడు. అది కూడా మే 27 న రిలీజ్ సిద్ధమవుతుంది.
అయితే తాజాగా వరుణ్ పెళ్లి ప్రశ్న నాగబాబు కి మరోసారి ఎదురైంది. సోషల్ మీడియాలో నాగబాబు ఫాన్స్ తో చిట్ చాట్ చేసారు. అందులో వరుణ్ పెళ్ళెప్పుడు అంటూ క్యాజువల్ గానే ఫాన్స్ నాగబాబు ని ప్రశ్నించారు. దానితో నాగబాబు ఈసారి తెలివిగా.. వరుణ్ పెళ్లి విషయమై వరుణ్ తేజే మీకు ఆన్సర్ ఇస్తాడు అంటూ తప్పించుకున్నారు కానీ.. ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరి వరుణ్ తేజ్ తన పెళ్లిపై ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో అంటూ ఫాన్స్ ఊహల్లోకి వెళ్లిపోయారు.