గత వారం రోజుల నుండి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో పండగ వాతావరణ కనిపిస్తుంది. వారం రోజుల నుండి ట్రిపుల్ ఆర్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో మొదలయ్యింది మొదలు.. ఇప్పటి వరకు ట్రిపుల్ ఆర్ సోషల్ మీడియాలో ఇండియా వైడ్ గా ట్రేండింగ్ లోనే ఉంది. #RRRMovie #RRRonMarch25 #RamCharan #NTR #RRR #RRRMassJathara #RRRinUSA #RRRPreReleaseEvent ఇలా ఏదో ఒక హాష్ టాగ్ అయితే ట్రేండింగ్ లోనే ఉంటుంది. ఎన్టీఆర్ ఫాన్స్, చరణ్ ఫాన్స్ మొత్తం సోషల్ మీడియాని కబ్జా చేసి ట్రిపుల్ ఆర్ అప్ డేట్స్ తో హీటెక్కిస్తున్నారు.
రాజమౌళి కూడా ఫాన్స్ కి గ్యాప్ అనేది ఇవ్వడం లేదు. మార్చ్ 25 శుక్రవారం ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యే వరకు నిద్ర లేకుండా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ చేస్తూ ఫాన్స్ కి కిక్ ఇస్తూనే ఉన్నారు. ఇండియా మొత్తం ట్రిపుల్ ఆర్ మ్యానియాతో ఊగిపోతోంది. రోజులు గంటలుగా మారి ఫాన్స్ లో క్యూరియాసిటీ ట్రిపుల్ ఆర్ అంతకంతకు పెరిగేలా చేస్తుంది. దానితో ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయ్. జై ఎన్టీఆర్, జై చరణ్ అంటూ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు వారు.