పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో ఇండస్ట్రీకి ఊపు తీసుకువచ్చారు. భీమ్లా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ తదుపరి రాజకీయాలతో కొద్దిగా బిజీగా మారారు. తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అవుతారు. పవన్ రాక కై క్రిష్ ఎదురు చూపులు ఈ మంత్ ఎండ్ కి ముగియబోతున్నాయి. ఇక ఏప్రిల్ నుండి పవన్ కళ్యాణ్ తన మేనల్లుడుతో కలిసి ఓ తమిళ రీమేక్ షూటింగ్ కూడా చెయ్యబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ పదే పదే పోస్ట్ పోన్ అవడానికి పవన్ కారణం కాదు మధ్యలో బాలీవుడ్ హీరోయిన్ మారడం, ఇంకా కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు షూటింగ్ మొదలు పెడితే.. ఏకధాటిగా హరి హర వీరమల్లు షూటింగ్ చిత్రకరణ చేపడతారని తెలుస్తుంది. షూటింగ్ ఓ కొలిక్కి వచ్చే సమయంలో రిలీజ్ డేట్ ఇస్తారని సమాచారం.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దసరా స్పెషల్ అంటున్నారట. అంటే హరి హర వీరమల్లు ని దసరా స్పెషల్ గా రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు ఎవరూ దసరా కి తమ సినిమాలను విడుదల చేస్తామంటూ చెప్పలేదు. ముందుగా క్రిష్ హరి హర వీరమల్లు డేట్ దసరాకే అంటూ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గాను, నిధి అగర్వాల్ హీరోయిన్ గాను నటించనున్నారు.