Advertisementt

తెలుగులో ఉన్న ఊపు వేరే లాంగ్వేజ్ లో లేదా?

Mon 21st Mar 2022 08:21 PM
rrr,rrr hindi version,book my show,telugu states,rrr advance bookings,ntr fans,mega fans  తెలుగులో ఉన్న ఊపు వేరే లాంగ్వేజ్ లో లేదా?
RRR Movie Advance bookings started తెలుగులో ఉన్న ఊపు వేరే లాంగ్వేజ్ లో లేదా?
Advertisement
Ads by CJ

తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్ ఆర్ మ్యానియా తో ఫాన్స్ కొట్టేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు మార్చ్ 25th వచ్చేస్తుందా అని రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ ఫాన్స్, చరణ్ ఫాన్స్ మాత్రమేనా సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, మూవీ లవర్స్ అంతా ట్రిపుల్ ఆర్ కోసం వెయిటింగ్. బుక్ మై షో లో ట్రిపుల్ ఆర్ టికెట్స్ ఓపెన్ అవుతున్నాయో లేదో.. ఇలా అమ్ముడుపోతున్నాయి. ఓ వారం పాటు బుక్ మై షో ని ట్రిపుల్ ఆర్ ఫాన్స్ కబ్జా చేసేసారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్, అంచనాలు, ఆత్రుత ట్రిపుల్ ఆర్ పై మిగతా భాషల్లో లేదు అనే మాట వేరే లాంగ్వేజెస్ లో వినిపిస్తుంది.

బాహుబలి తో ప్రపంచాన్నే చుట్టేసిన రాజమౌళి.. ట్రిపుల్ ఆర్ విషయంలో ఎలాంటి టెంక్షన్ లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు. అలాగే ఆయా భాషల స్టార్ హీరోలు ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చేస్తున్నారు. కానీ కొన్ని భాషల మీడియా వాళ్ళు ట్రిపుల్ ఆర్ పై విషం కక్కుతున్నారని, నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ కలవర పడుతున్నారు. బాలీవుడ్ మీడియా లో ట్రిపుల్ ఆర్ పై నెగెటివ్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారని, బుక్ మై షో లో ఇతర భాషల్లో క్రేజీ బుకింగ్స్ లేవని, తెలుగులో ఉన్న క్రేజ్ ఇతర లాంగ్వేజెస్ లో లేదు అంటూ ప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ కంగారు పడుతున్నారు..

RRR Movie Advance bookings started:

Early Trend: RRR Hindi Version Advance Bookings!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ