యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రాజీవ్ కనకాల మంచి స్నేహితుడు అన్న విషయం తెలిసిందే. రాజీవ్ కనకాల ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాల్లో కనిపించాడు. అలా యాంకర్ సుమ తో ఎన్టీఆర్ కి పరిచయముంది. అయితే రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లను మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణి ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూలో కీరవాణి యాంకర్ సుమ ని మనం రెండు వేలో.. మూడు వేలో ఆడియో ఫంక్షన్స్ లో చూసుంటాం. అందులో నేనే 500 ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యి ఉంటాను. అలాంటి సుమని మనం అక్క అనాలో, ఇంకేమనాలో ఆంటూ ఫన్ చెయ్యగా.. ఇప్పడు సుమ ఒక సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా సక్సెస్ అయ్యి తర్వాత మీ సినిమాల్లో ఏదైనా క్యారెక్టర్ ఇవ్వాల్సి వస్తే ఎలాంటి పాత్రను ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటారు అని కీరవాణి ఎన్టీఆర్ ని చరణ్ ని ఓ ప్రశ్న అడిగారు.
దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ నాయనమ్మ, ఓ అమ్మమ్మలాంటి కేరెక్టర్స్ ఇవ్వాలన్నారు. సుమను చూడగానే నిర్మలమ్మ, సూర్య కాంతం వంటి వాళ్లు పోషించిన గయ్యాలి పాత్రలు గుర్తుకు వస్తాయని ఎన్టీఆర్ అన్నారు. సుమకు చాదస్తం ఎక్కువైందని, నోరేసుకుని పడిపోతుందని ఎన్టీఆర్ సుమ గురించి అలా ఫన్నీ గా మాట్లాడడం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.