Advertisementt

చైతు ని అన్ ఫాలో చేసిన సమంత

Mon 21st Mar 2022 05:15 PM
samantha,unfollows,naga chaitanya,instagram,samantha unfollows naga chaitanya  చైతు ని అన్ ఫాలో చేసిన సమంత
Samantha unfollows Naga Chaitanya చైతు ని అన్ ఫాలో చేసిన సమంత
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లవ్లీ కపుల్, క్యూట్ జంట నాగ చైతన్య - సమంత ప్రేమించుకుని పెళ్లితో ఒక్కటై నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. చైతు - సమంత విడాకుల మేటర్ గత ఏడాది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. సమంత చైతు నుండి దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసి మరీ హింట్స్ ఇచ్చింది, చైతూ మాత్రం కామ్ గా ఉన్నాడు. తర్వాత విడాకుల పేరుతొ విడిపోయిన ఈ జంట ఎందుకు సపరేట్ అయ్యారో ఎవ్వరికి అర్ధం కాలేదు. అక్కినేని ఫాన్స్ మాత్రమే కాదు, చాలామంది వీరి విడాకుల విషయంలో  ఫీలయ్యారు. ఇప్పటికి ఫీలవుతూనే ఉన్నారు. సమంత సపరేట్ అయ్యాక తన కెరీర్ లో బిజీ అయ్యింది. 

అటు నాగ చైతన్య విడాకులు తో ఇద్దరం హ్యాపీ గా ఉన్నామనే స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఇక సమంత గ్లామర్ గా ఉన్న ఫొటోస్ ని షేర్ చేసినా.. లేదా ఆమె ఏదైనా ఇంపార్టెంట్ విషయం షేర్ చేసిన చైతు మామ వెంకీ కూతురు, అలాగే రానా లాంటి వాళ్ళు సామ్ ని సపోర్ట్ చేస్తున్నారు. చైతు ని సోషల్ మీడియాలో ఇప్పటివరకు సమంత అన్ ఫాలో చెయ్యలేదు. కానీ చైతు తో ఉన్న ఫొటోస్ మాత్రం డిలేట్ చేసేసింది. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ లో నాగ చైతన్యను సమంత అన్ ఫాలో చేసింది. అయితే చైతు మాత్రం ఇప్పటికి సామ్ ని ఫాలో అవుండడమే కాదు, ఆమెతో ఉన్న ఫొటోస్ ని కూడా డిలేట్ చెయ్యకపోవడం గమనార్హం. 

Samantha unfollows Naga Chaitanya:

Samantha unfollows Naga Chaitanya on Instagram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ