తెలుగులో లక్కీ హీరోయిన్ గా, సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వరస ఆఫర్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కృతి శెట్టి అటు కోలీవుడ్ లోను హీరో రామ్ తో కలిసి గ్రాండ్ గా అడుగుపెట్టబోతుంది. లింగు సామీ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న ద వారియర్ మూవీ తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాతోనే కృతి శెట్టి తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక తెలుగులోనూ ఫుల్ బిజీ తారగా మారిన కృతి శెట్టికి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ తగిలింది అని తెలుస్తుంది అది కూడా స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన అంటున్నారు.
గత ఏడాది నాలుగు భాషల్లో రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన శ్యామ్ సింగ రాయ్ మూవీ హిందీలో రీమేక్ అవుతుంది అని.. ఈ మూవీలో నాని కేరెక్టర్ ని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ చేయబోతున్నారట. అయితే తెలుగులో మోడరన్ గర్ల్ గా శ్యామ్ సిగ్ రాయ్ లో నటించిన కృతి శెట్టి కేరెక్టర్ కి బాలీవుడ్ లో కూడా ఆమెతోనే చేపించాలని మేకర్స్ చూస్తున్నారట. మరి శ్యామ్ సింగ రాయ్ ఇక్కడే సూపర్ సక్సెస్ అయ్యింది. మళ్ళీ హిందీలో రీమేక్ అవడం, అందులోను షాహిద్ కపూర్ లాంటి స్టార్ సరసన ఛాన్స్ వస్తే కృతి శెట్టి వదులుతుందా.. వెంటనే ఓకె చెప్పెయ్యదూ..