ప్రభాస్ లేటెస్ట్ చిత్రం రాధే శ్యామ్ ఫలితం తేలిపోయింది. ఆ సినిమా రిలీజ్ అవ్వగానే ప్రభాస్ విదేశాలకు వెకేషన్స్ ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిపోయారు. ఇక ప్రభాస్ వెకేషన్స్ నుండి తిరిగిరాగానే.. నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ లో జాయిన్ అవుతారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ హీరోయిన్ దీపికా పదుకొనేపై కొన్ని సీన్స్ షూట్ చేసారు నాగ్ అశ్విన్. ఈ సినిమా సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతుంది అని, ప్రభాస్ సూపర్ మ్యాన్ లా కనిపిస్తారని ప్రచారం జోరు మీదుంది.
అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ కె లో ప్రభాస్ కేరెక్టర్, బిగ్ బి అమితాబ్ చేసే కేరెక్టర్స్ ఇవే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది టైం మిషన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పురాణ ఇతిహాసాల టచ్ ఇవ్వబోతున్నారట. విష్ణు మూర్తి కల్కి కథ, ద్రోణాచార్యుని కొడుకు అశ్వద్ధామ కేరెక్టర్స్ ని బేస్ చేసుకుని ప్రభాస్, అమితాబ్ కేరెక్టర్స్ ని నాగ్ అశ్విన్ డిజైన్ చేశారట. అంటే అశ్వద్ధామగా అమితాబ్, కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారన్నమాట. మరి ఇందులో ఎంత నిజముందో కానీ.. ఈ న్యూస్ చూస్తే మాత్రం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది.