మార్చ్ 25 కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఫాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మార్చి 24 మిడ్ నైట్ నుండే ట్రిపుల్ సందడి కనిపించబోతుంది. యుఎస్ ప్రీమియర్స్ తో దడదడ లాడించాలనే ప్లాన్ లో ఉన్నారు ఫాన్స్. అదే రోజు ట్రిపుల్ ఆర్ కి పోటీగా రెండు భారీ సినిమాలు ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయి. అందులో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుండి, ఆహా ఓటిటి నుండి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుంది. మరో పక్క తమిళ్ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ సెన్సేషన్ వలిమై కూడా అదే మార్చ్ 25 న ప్రముఖ ఓటిటి సంస్థ జీ 5 నుండి రిలీజ్ కాబోతుంది.
మార్చ్ 25 ఓటిటి vs థియేటర్స్ అన్న రేంజ్ లో ఉండబోతుంది. ఏదైనా ముందు ట్రిపుల్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు ప్రేక్షకులు. ఒకవేళ ట్రిపుల్ ఆర్ టికెట్స్ దొరక్కపోతే భీమ్లా నాయక్, వలిమై సినిమాలు ఓటిటిలో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. భీమ్లా నాయక్ కానీ, అటు వలిమై కానీ మార్చ్ 25 నే డేట్ ఫిక్స్ చేసుకోవడం మాత్రం ట్రిపుల్ ఆర్ ఫాన్స్ కి సుతారము ఇష్టం లేదు. కానీ మేకర్స్ మాత్రం తమ సినిమాలని ఓటిటీలకి అమ్మేసాం.. దానికి సంబందించిన డీల్ ఎప్పుడో పూర్తయ్యింది. సో వారు ఎప్పుడు రిలీజ్ చేసుకుంటే మాకెందుకు అన్నట్టుగా ఉంది భీమ్లా, వలిమై మేకర్స్ వ్యవహారం.