అఖండ తో అద్భుతమైన సక్సెస్ సాధించిన నందమూరి నటసింహం తర్వాత చిన్నపాటి గ్యాప్ తో ఇమ్మిడియట్ గా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో NBK107 సెట్స్ మీదకి వెళ్లిపోయారు. ఆ మూవీ లో బాలకృష్ణ లుక్ కి ఫాన్స్ మాత్రమే కాదు సినిమా లవర్స్ అందరూ షాకయ్యారు. అంతలాంటి మాస్ లుక్ లో, బ్లాక్ షర్ట్ తో లుంగీ తో ఫ్యాబులస్ లుక్ లో యంగ్ హీరోలకే షాక్ ఇచ్చారు. మాస్ మసాలా కంటెంట్ తో నిజజీవిత సంఘటనలతో కూడిన ఓ పవర్‌ఫుల్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అఖండ ని అద్భుత విజయం వైపు తీసుకువెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై థమన్ రీసెంట్ గా ట్వీట్ చేసాడు. థమన్, గోపీచంద్ మలినేని, రామజోగయ్య శాస్త్రి, సింగర్ శ్రీ కృష్ణ తిరుమల తిరుపతి శ్రీ వారి దర్శనం తర్వాత దిగిన ఫోటో ని షేర్ చేస్తూ నందమూరి బాలకృష్ణ గారి సినిమా మ్యూజిక్ జర్నీ మొదలైంది. మా బావ గోపీచంద్ మలినేని మరోసారి NBK107 తో సత్తా చాటబోతున్నాడు. మా రామజోగయ్య శాస్త్రి గారి రచన, సింగర్ శ్రీకృష్ణతో కలిసి పని చేస్తున్నాం.. జై బాలయ్య అంటూ థమన్ ట్వీట్ చేశాడు. థమన్ ట్వీట్ చూసిన నందమూరి ఫాన్స్ సోషల్ మీడియాలో చెలరేగిపోయి NBK107 ని ట్రెండ్ చేస్తున్నారు.