Advertisementt

పుష్ప కి సన్మానం

Sun 20th Mar 2022 07:10 PM
allu arjun,park hyatt,pushpa hit,pushpa the rule  పుష్ప కి సన్మానం
Tribute to Pan India star Allu Arjun పుష్ప కి సన్మానం
Advertisement
Ads by CJ

సుకుమార్ దర్శకుడిగా అల్లు అర్జున్ పుష్ప ద రైజ్ అంటూ పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. కొద్దిపాటి ప్రమోషన్స్ తోనే హిందీలో పుష్ప తో రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టారు. పుష్ప పార్ట్ వన్ సూపర్ హిట్ అవడంతో పార్ట్ 2 పుష్ప ద రూల్ పై అంచనాలు పెరిగిపోయాయి. పుష్ప తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ కి ఈ రోజు పార్క్ హయాత్ లో పలువురు ప్రముఖుల నడుమ సన్మానం జరిగింది. 

డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా ఘన విజయం సాధించిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సన్మానం కార్యక్రమం శనివారం పార్క్ హయత్ హోటల్లో ఘనంగా జరిగింది 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బిరామిరెడ్డి , భానుప్రకాష్ ఐఏఎస్ (మాజీ యూనిటెడ్ ఆంధ్ర ప్రదేశ్ దేశ్ 

ప్రిన్సిపాల్ సెక్రటరీ పీఎంవో చీఫ్ సెక్రటరీ ఆఫీస్ మరియు మాజీ అస్సాం చీఫ్ సెక్రెటరీ ) ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, క్రిష్, గుణశేఖర్ లతో పాటు అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ గజమాలతో సత్కరించారు.

Tribute to Pan India star Allu Arjun:

Allu arjun hosted a grand party in park hyatt

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ