గత రాత్రి చిక్ బళ్లాపూర్ లో జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఫాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తెలుగు దేశం పార్టీ జెండాలతో ర్యాలీలు, ఈవెంట్ లో జై ఎన్టీఆర్ అనే నినాదాలు, ఎన్టీఆర్ స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ కి ఇప్పుడు ఊహించని విధంగా ఆయనకు మద్దతు లభిస్తుంది. అటు ఫాన్స్ మాత్రమే కాకుండా ఇటు టీడీపీ యంగ్ లీడర్స్, టిడిపి యువ కార్యకర్తలు ఆంతా ఎన్టీఆర్ కే సపోర్ట్ ఇస్తున్నాను. ఎప్పటినుండో ఆయన్ని టిడిపిలోకి తీసుకురమ్మని చంద్రబాబు నాయుడుని అడుగుతున్న కార్యకర్తలు ఇప్పుడు బహిరంగంగా జై తారక్ అన్నా, జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ టీడీపీ మద్దతు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ కి కలిసి రానుంది.
మరోవైపు వైసిపి లో ఎన్టీఆర్ మిత్రుడు కొడాలి నాని సపోర్ట్ ఎన్టీఆర్ కి అందుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అంటే కొడాలి నాని సీఎం జగన్ ని ఒప్పించి ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ టికెట్ రేట్స్ పెంచుకునేలా మాట తీసుకున్నాడని, అందుకే రాజమౌళి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తో పాటుగా కొడాలి నాని కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థాంక్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ కి కొడాలి నాని ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నారని, రాధే శ్యామ్ కి, భీమ్లా నాయక్ కి పెరగని టికెట్ రేట్స్ ట్రిపుల్ ఆర్ కి పెరిగాయంటేనే అక్కడ కొడాలి నాని హస్తం ఉంది అంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది.