Advertisementt

పెన్నీ సాంగ్ తో దున్నేసిన సితార - మహేష్

Sun 20th Mar 2022 05:24 PM
sarkaru vaari paata,sithara,mahesh babu,sithara penny priceless,penny song  పెన్నీ సాంగ్ తో దున్నేసిన సితార - మహేష్
Penny song from Sarkaru Vaari Paata stealing hearts పెన్నీ సాంగ్ తో దున్నేసిన సితార - మహేష్
Advertisement
Ads by CJ

సర్కారు వారి పాట కళావతి సాంగ్ సెన్సేషన్ కొనసాగుతుండగానే.. ఇప్పుడు సెకండ్ సింగిల్ సర్ ప్రైజ్ వచ్చేసింది. మహేష్ - కీర్తి సురేష్ పై చిత్రీకరించిన రొమాంటిక్ కళావతి సాంగ్ స్టెప్స్ ఇంకా ఇంకా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కళావతి మ్యూజిక్ వినిపిస్తుంది. సెలబ్రిటీస్ దగ్గరనుండి మహేష్ లేడీ ఫాన్స్ వరకు కళావతి స్టెప్స్ కి కాలు కదుపుకున్నారు. మహేష్ డాటర్ సితార కూడా ఆ సాంగ్ కి అద్భుతంగా డాన్స్ చేసి చూపించింది. అలాగే రికార్డ్ వ్యూస్, లైక్స్ తో ఇంకా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు సర్కారు వారి పాట నుండి సెకండ్ మాసివ్ సాంగ్ అది కూడా సితార డాన్స్ స్పెషల్ తో వచ్చేసింది. 

రెండవ సింగిల్ పెన్నీ సాంగ్ ని ఈ రోజు రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ లో మహేష్ హ్యాండ్ సమ్ లుక్స్ తో మాసివ్ అవతార్ లో కనిపిస్తుంటే.. ఆయన కూతురు సితార పెన్నీ సాంగ్స్ స్టెప్స్ దున్నేసింది. సితార బ్యూటిఫుల్ స్టెప్స్ పెన్నీ సాంగ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా సితార తో కాలు కదిపారు. మహేష్ వేసిన పెన్నీ స్టెప్స్, సితార వేసిన మాసివ్ స్టెప్స్ అన్ని అద్భుతః అన్న రేంజ్ లో ఉన్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఫస్ట్ సాంగ్ తోనే రికార్డ్స్ సెట్ చేసారు. దానితో రెండో సాంగ్ పై హైప్ అంతకంతకు పెరిగిపోయింది. ఆ అంచనాలను అందుకోవడం పెన్నీ సాంగ్ సక్సెస్ అయ్యింది. కానీ సితార డాన్స్ తో మహేష్ ఫాన్స్ మాత్రం ఫుల్ గా సర్ ప్రైజ్ అవుతున్నారు.

Penny song from Sarkaru Vaari Paata stealing hearts:

Sarkaru Vaari Paata : Sithara Penny priceless

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ