Advertisementt

అలియా పై ఫైర్ అవుతున్న ఫాన్స్

Sun 20th Mar 2022 02:36 PM
alia bhatt,rrr movie,ntr,ram charan,ntr fans,charan fans,rajamouli  అలియా పై ఫైర్ అవుతున్న ఫాన్స్
Fans firing on Alia Bhatt అలియా పై ఫైర్ అవుతున్న ఫాన్స్
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ లో నటించడం తన అదృష్టం అని, రాజమౌళి తో వర్క్ చెయ్యడం లక్కీ అని చెప్పిన అలియా భట్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కి రావడం లేదు. కమిట్మెంట్ ప్రకారం డిసెంబర్ లోనే ట్రిపుల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న అలియా భట్.. అప్పుడు సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. సో ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. ఇలాంటి టైం లో టీం కి సపోర్ట్ చెయ్యడం మానేసి పార్టీలు, వెకేషన్స్ అంటూ తిరుగుతుంది. ట్రిపుల్ ఆర్ కి ఎన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఏదో ఒక్కదానికి అలియా భట్ హాజరైతే ఆ క్రేజ్, హైప్ మాములుగా ఉండదు. ఎందుకంటే బాలీవుడ్ లో అలియా భట్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. కనీసం దుబాయ్ ఈవెంట్ లో అయినా కనబడాల్సింది. కాదు నిన్న చిక్ బంగళాపూర్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా హాజరవ్వాల్సింది. 

అలియా భట్ ఏ ఈవెంట్స్ లో కనిపించకపోయేసరికి ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ కి తిక్కరేగుతుంది. ఏదైనా డబ్బుతో ముడిపెట్టకూడదు. కొన్ని విషయాల్లో పట్టు విడుపు ఉండాలి. ఆర్.ఆర్.ఆర్ అంటే కేవలం తెలుగు సినిమా కాదు. ఇండియా ప్రైడ్ మూవీ. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తుంది. అందుకే ట్రిపుల్ ఆర్ లో కీలక పాత్రలో నటించిన అలియా భట్ కూడా ప్రమోషన్స్ లో కనిపిస్తే బావుండేది అంటూ ఫాన్స్ భావన. కానీ అలియా భట్ మాత్రం ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ ని లైట్ తీసుకుంది. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ ని రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లే తమ భుజాలపై మోస్తున్నారు. 

Fans firing on Alia Bhatt:

NTR and Charan Fans firing on Alia Bhatt

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ