Advertisementt

గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ త్యాగం

Sun 20th Mar 2022 01:18 PM
salman khan,megastar chiranjeevi,ram charan,salman cameo in godfather,god father movie  గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ త్యాగం
Salman Khan Sacrifice for Godfather గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ త్యాగం
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరు తో, రామ్ చరణ్ తో ఉన్న స్నేహ బంధం కారణంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చిరు గాడ్ ఫాదర్ మూవీలో నటిచడానికి ఒప్పుకున్నారు. అదికూడా గాడ్ ఫాదర్ కి బాడీ గార్డ్ గా నటించడం అంత మాములు విషయం కాదు. దానితో గాడ్ ఫాదర్ పై అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. సల్మాన్ ఖాన్ ఓ తెలుగు మూవీలో గెస్ట్ రోల్ చెయ్యడం కన్నా క్రేజ్, హైప్ ఏముంటుంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు గాను రామ్ చరణ్ ఇంకా సూపర్ గుడ్ మూవీస్ వారు సల్మాన్ ఖాన్ కి భారీ పారితోషకమే ఆఫర్ చేశారట. చిరు కూడా మీకెంత కావాలో చెప్పమని సల్మాన్ ఖాన్ ని అడిగారట.

కానీ ఫ్రెండ్ షిప్ కి ఎంతో విలువ‌నిచ్చే స‌ల్మాన్ ఖాన్‌.. గాడ్ ఫాదర్ కోసం చేస్తున్న 15 రోజుల కాల్షీట్స్ కి రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డానికి నిరాక‌రించార‌ట‌. కాద‌ని బ‌ల‌వంతం చేస్తే తాను సినిమా నుంచి త‌ప్పుకుంటాన‌ని చిరంజీవికి స్ట్రాంగ్‌గా కూడా చెప్పారని అంటున్నారు. మరి సల్మాన్ ఖాన్ సినిమాలకి రామ్ చరణ్ గతంలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. అలాంటి స్నేహ బంధాన్ని డబ్బుతో ముడిపెట్టవద్దు అంటూ సల్మాన్ చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లోనే సల్మాన్ ఖాన్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేయనున్నారట మోహన్ రాజా.

Salman Khan Sacrifice for Godfather:

Salman Khan Offered Rs 20 Crores for Cameo in Godfather

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ