రాజమౌళి ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో తన హీరోలైన ఎన్టీఆర్ - చరణ్ తో కలిసి పరుగులు పెడుతున్నారు. మరో ఐదు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ తో హీటెక్కిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో ఎక్కడ ఎంతమంది అడిగినా రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు. ముందు ట్రిపుల్ ఆర్ తర్వాత వెకేషన్స్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటూ చెబుతూ వచ్చారు. కానీ ఈ రోజు బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ లో రాజమౌళి కన్నడ మీడియా తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై చిన్న అప్ డేట్ ఇచ్చారు.
అంటే మహేష్ తో రాజమౌళి చెయ్యబోయే సినిమా మల్టీస్టారర్ అని, ఆ సినిమాలో నందమూరి నట సింహం బాలకృష్ణ నటించబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా కొన్ని న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దానికి సమాధానం ఇస్తూ రాజమౌళి.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మల్టీస్టారర్ కాదని.. సింగల్ స్టారర్ మూవీగా రాబోతున్నట్లుగా చెప్పారు. దానితో అటు మహేష్ ఫాన్స్, ఇటు నందమూరి ఫాన్స్ కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక మహేష్ తో రాజమౌళి చెయ్యబోయే ప్రాజెక్ట్.. ట్రిపుల్ ఆర్ రిలీజ్ తర్వాత రాజమౌళి ఫ్యామిలీ వెకేషన్స్ ముగించుకున్నాక ఆ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వస్తుంది అని తెలుస్తుంది.