Advertisementt

అప్పుడు సమంత ని 'ఊ' అనిపించారు.. ఇప్పుడు

Sat 19th Mar 2022 05:24 PM
disha patani,pushpa 2,allu arjun,sukumar,samantha,devisri prasad  అప్పుడు సమంత ని 'ఊ' అనిపించారు.. ఇప్పుడు
Disha Patani Special Item Song in PUSHPA 2 అప్పుడు సమంత ని 'ఊ' అనిపించారు.. ఇప్పుడు
Advertisement
Ads by CJ

పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్ గా డీ గ్లామరస్ లుక్ లో కనిపించింది. అయితే ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది, దేవిశ్రీ ప్రసాద్ ఆల్బమ్స్ లో బెస్ట్ సాంగ్ గా నిలిచింది మాత్రం సమంత తో బన్నీ చేసిన ఊ అంటావా మావ ఉ ఊఁ అంటావా మావ స్పెషల్ సాంగ్. ఇండియా వైడ్ గా సమంత గ్లామర్ కి, దేవిశ్రీ మ్యూజిక్ కి, ఆ సాంగ్ లిరిక్స్ కి ఫాన్స్ మాత్రమే కాదు.. క్రేజీ మ్యూజిక్ లవర్స్ కూడా ఊగిపోయారు. ఆ సాంగ్ ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. సమంత నే చెప్పింది ఈ సాంగ్ తో తనెంతగా క్రేజీగా మారానో అనేది. మరి ఫస్ట్ టైం సమంత ని ఊ అంటావా మావా ఉ ఊఁ అంటావా మావా సాంగ్ లో చెయ్యడానికి ఊ అనిపించారు దర్శకనిర్మాతలు.

పుష్ప పార్ట్2 లో కూడా ఓ ఐటమ్ నెంబర్ ఉండబోతుందట. పుష్ప ద రైజ్ అప్పుడే అల్లు అర్జున్ తో దిశా పాటని ఐటెం సాంగ్ చేయబోతుంది అన్నా.. చివరికి ఆ ప్లేస్ లోకి సమంత వచ్చింది. అయితే ఇప్పుడు పార్ట్ 2 కోసం దిశా పటాని నే ఊ అనిపించేపనిలో చిత్ర బృందం ఉందట. సెకండ్ పార్టులో ఈ మాస్ బీట్ యూత్ ను, మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేయడం ఖాయమని, ఆ సాంగ్ లో బన్నీ తో కాలు కదిపేందుకు బాలీవుడ్ భామ దిశనే దింపాలని సుక్కు - దేవి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఈసారి దిశా పటాని కూడా కోట్లు అడక్కుండా.. క్రేజ్ కోసమైనా ఈ సాంగ్ కి ఊ అనాల్సిందే. 

Disha Patani Special Item Song in PUSHPA 2:

Disha Patani Item Song in PUSHPA The Rule

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ