Advertisementt

కృతి శెట్టి కి మరో మెగా ఆఫర్

Sat 19th Mar 2022 02:05 PM
sai tej,krithi shetty,pawan klayan,tamil remake,vinodhaya sitham,samuthirakani  కృతి శెట్టి కి మరో మెగా ఆఫర్
Another mega offer for Krithi Shetty కృతి శెట్టి కి మరో మెగా ఆఫర్
Advertisement
Ads by CJ

ట్రెడిషనల్ గర్ల్ గా మెగా హీరో వైష్ణవ్ తేజ్ కలిసి ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ని వరస సక్సెస్ లు పలకరిస్తున్నాయి. శ్యామ్ సింగ రాయ్ లో చేసింది చిన్న పాత్రే అయినా.. ఆ సినిమా హిట్ క్రెడిట్ కృతి శెట్టి అకౌంట్ లోకి చేరింది. తర్వాత బంగార్రాజు లో నాగలక్ష్మి గా పల్లెటూరి సర్పంచ్ గా అద్భుతమైన హిట్ ని ఖాతాలో వేసుకుంది. తర్వాత రామ్ వారియర్ లో విజిల్ మహాలక్ష్మి గా, నితిన్ మాచర్ల నియోజక వర్గంలోనూ, అలాగే సుధీర్ బాబు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న కృతి శెట్టి కి వరస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా కృతి శెట్టి ని మరో మెగా ఆఫర్ వరించినట్లుగా టాక్.

అది పవన్ కళ్యాణ్ - సాయి ధరం తేజ్ కలయికలో తమిళ్ దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం వినోదయ సీతమ్‌కి రీమేక్ లో సాయి తేజ్ సరసన కృతి శెట్టి అయితే బావుంటుంది అని ఆమెని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్- సాయి తేజ సినిమా ని రెండు షెడ్యూల్స్ లోనే 40 రోజుల్లో పూర్తి చేస్తారని, ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజులకి 50 కోట్లు అందుకోబోతున్నారనే టాక్ ఉంది. ఇక ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి రెగ్యులర్ షూట్ కి వెళ్లనున్నారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

Another mega offer for Krithi Shetty:

Sai Tej to romance Krithi Shetty

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ