ఏదైనా భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమా గురించిన ఆసక్తికర అంశాలు, సినిమాలో ఏమైనా మెయిన్ సీక్రెట్స్ ఉంటే అవి ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూ లలో రివీల్ చేస్తుంది టీమ్ అనే ఆత్రుత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. రాజమౌళి ట్రిపుల్ ఆర్ గురించిన చాలా విషయాలను డిసెంబర్ లోనే పలు ప్రెస్ మీట్స్ లో చెప్పసారు. ఇక చరణ్ - ఎన్టీఆర్ స్నేహాన్ని కూడా చాలాసార్లు ట్రిపుల్ ప్రెస్ మీట్ స్టేజ్ లపై వారిద్దరూ పంచుకున్నారు. ఇక తెలుగు ప్రెస్ మీట్స్ లో కూడా చరణ్ - ఎన్టీఆర్ - రాజమౌళి లు ట్రిపుల్ ఆర్ విషయాలను చాలా వరకు రివీల్ చేసారు. కానీ ఆ తర్వాత సినిమా పోస్ట్ పోన్ అయ్యి మార్చ్ 25 కి డేట్ మారింది.
దానితో రాజమౌళి మరోసారి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. డిసెంబర్ లో ఎలా అయితే సినిమాని ప్రమోట్ చేసారో మళ్ళీ అదే మాదిరి ప్రమోషన్స్ చేస్తున్నారు కానీ అందులో కొత్తదనం లేదు. టాలీవుడ్ లో అనిల్ రావిపూడి తో చేసిన ఇంటర్వ్యూ కొత్తగా ఉంది. ప్రశ్నలు పాతవే అయినా.. ఆ ఇంటర్వ్యూ అందరిలో ఆశక్తిని రేకెత్తించింది. ఇక రీసెంట్ గా దుబాయ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్కడి మీడియా కూడా రొటీన్ ప్రశ్నలే. డిసెంబర్ లో అడిగిన ప్రశ్నలు, టాలీవుడ్ లో విన్న సమాధానాలు అన్నట్టుగా ఆ మీడియా మీట్ కొనసాగింది. దానితో బోర్ కొట్టిస్తున్న ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ అంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రచారం మొదలు పెట్టింది. అవే ప్రశ్నలు, అవే సమాధానాలు రెండు మూడు కాదు.. పదేసి సార్లు వినడానికి బోర్ కొట్టేస్తుంది అంటున్నారు చాలామంది నెటిజెన్స్.