Advertisementt

ప్రభాస్ కి ఆపరేషన్?

Fri 18th Mar 2022 10:35 PM
prabhas,surgery,radhe shyam,prabhas new,spain  ప్రభాస్ కి ఆపరేషన్?
Surgery to Prabhas? ప్రభాస్ కి ఆపరేషన్?
Advertisement
Ads by CJ

రాధే శ్యామ్ రిజల్ట్ తో కాస్త డిస్పాయింట్ అయిన ప్రభాస్, ఆ సినిమాలో ఆయన పై లుక్స్ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభాస్ ఏజ్ విషయంలో బాలీవుడ్ మీడియా చీల్చి చెండాడింది. లుక్స్ విషయంలో ప్రభాస్ ఫాన్స్ కి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. రీసెంట్ గా ప్రభాస్ స్పెయిన్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ స్పెయిన్ వెళ్ళింది ఆపరేషన్ చేయించుకోవడానికి అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే వర్కౌట్స్ తో బరువు తగ్గించుకోలేక ఏమైనా ఆపరేషన్ చేయించుకుంటున్నాడా అనే అనుమానం అందరిలో మొదలయ్యింది.

కానీ ప్రభాస్ సలార్ మూవీ షూటింగ్ సమయంలో గాయపడ్డారని, ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడే ప్రభాస్ గాయపడినా.. ఆ గాయం పెద్దగా ఇబ్బంది పెట్టకపోవడంతో.. రాధే శ్యామ్ ప్రమోషన్స్ అలాగే, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొన్నారట. అయితే ఇప్పుడు ఆ గాయం ఇబ్బంది పెట్టడంతో ప్రభాస్ స్పెయిన్ వెళ్లి ఆ గాయానికి ఆపరేషన్ చేయించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభాస్ కి ఆపరేషన్ అన్న విష‌యం తెలిసిన ఫ్యాన్స్‌లో తెలియ‌ని కంగారు మొద‌లైంది. కాకపోతే అభిమానులు టెన్ష‌న్ ప‌డేంత ఏమీ లేద‌ని, ప్రభాస్ కి జరిగింది మైన‌ర్ ఆప‌రేష‌న్ అని స‌మాచారం. డాక్ట‌ర్స్ కొన్నిరోజుల పాటు ప్ర‌భాస్‌ను విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించినట్లుగా తెలుస్తుంది.

Surgery to Prabhas?:

Shock: Prabhas underwent a surgery

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ