Advertisementt

దుబాయ్ లో కూడా మిస్ అయ్యిందే

Fri 18th Mar 2022 04:48 PM
ram charan,alia bhatt,ntr,rajamouli,rrr promotions,alia bhatt,dubai event  దుబాయ్ లో కూడా మిస్ అయ్యిందే
Missed in Dubai too దుబాయ్ లో కూడా మిస్ అయ్యిందే
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి కలిసి దుబాయ్ లో జరగబోయే ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కోసం దుబాయ్ లో వాలారు. అక్కడ దుబాయ్ లో ల్యాండ్ అయిన చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ఫొటోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ అయితే తన పెట్ రైమా ని తీసుకుని మరీ దుబాయ్ వెళ్లారు. అయితే మార్చ్ 25 న రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో అలియా భట్ కనిపించడం లేదు. అలియా భట్ కూడా చరణ్ - ఎన్టీఆర్ తో జాయిన్ అయితే మజా ఉంటుంది అంటూ ఎన్టీఆర్ ఫాన్స్, చరణ్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. పోనీ తెలుగు ప్రమోషన్స్ లో కనిపించకపోయినా.. నేషనల్ వైడ్ ప్రమోషన్స్ లో అలియా భట్ పాల్గొంటే బావుంటుంది అని ఎదురు చూటున్నారు.

ఇక దుబాయ్ లో ఎన్టీఆర్, చరణ్, జక్కన్న లే కనిపిస్తున్నారు తప్ప అలియా భట్ ఎక్కడా కనిపించలేదు గత రాత్రి కరణ్ జోహార్ హోస్ట్ గా జరిగిన అపూర్వ మెహతా పుట్టిన రోజు వేడుకల్లో అలియా చాలా గ్లామర్ గా హడావిడి చేసింది. మొన్నటి నుండి అలియా భట్ బర్త్ డే వేడుకల కోసం మాల్దీవులకు వెళ్ళింది, నిన్న మరొకరి బర్త్ డే పార్టీలో హడావిడి చేస్తుంది. అలియా కి ఆర్.ఆర్.ఆర్ అక్కర్లేదా అనే కామెంట్స్ పడుతున్నాయి. అలియా భట్ కూడా చరణ్ - ఎన్టీఆర్ తో జాయిన్ అయితే ఆ ఈవెంట్ కి గ్లామర్ తోడవుతుంది. లేదంటే ఆ ఈవెంట్ లో ఆ గ్లామర్ మిస్ అవుతుంది. మరి ఈరోజు జరగబోయే దుబాయ్ ఈవెంట్, రేపు జరగబోయే బెంగుళూరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అలియా భట్ వస్తుందేమో అని ఫాన్స్ వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.

Missed in Dubai too:

Ram Charan travels with pet dog Rhyme to Dubai 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ