నితిన్.. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో మాచర్ల నియోజక వర్గం షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. తర్వాత నితిన్ వక్కంతం దర్శకత్వంలో జూనియర్ సినిమా చెయ్యబోతున్నారు. మాచర్ల నియోజక వర్గంలో బంగార్రాజు బ్యూటీ కృతి శెట్టి తో రొమాన్స్ చేస్తున్న నితిన్ జూనియర్ లో పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల తో రొమాన్స్ చెయ్యబోతున్నారు అని తెలుస్తుంది. పెళ్లి సందD సినిమా హిట్ కాకపోయినా.. ఆ సినిమాలో శ్రీ లీల లుక్స్, యాక్టింగ్ కి ఆమెకి బోలెడన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పటికే శ్రీలీల రవి తేజ సినిమాలో నటిస్తుంది. అలాగే ప్రభాస్ తో మారుతీ చెయ్యబోయే మూవీలోనూ శ్రీలీల పేరు గుట్టుగా వినిపిస్తుంది.
లంగావోణీ, గ్లామర్ డ్రెస్సులతో చక్కని హైట్, అంతే అందమైన లుక్స్ ఉన్న శ్రీ లీల యంగ్ హీరోలతో జోడి కడుతూ బిజిగా మారింది. ఇక మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబో మూవీలను శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా నటించనుంది అని, శ్రీ లీల కోసం సెకండ్ హీరోయిన్ పాత్ర నిడివిని త్రివిక్రమ్ పెంచేరనే టాక్ కూడా ఉంది. ఇక ఇప్పుడు వక్కంతం - నితిన్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా బుక్ అయ్యింది అనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.