ప్రభాస్ - పూజ హెగ్డే కలయికలో గత శుక్రవారం పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన రాధే శ్యామ్ అన్ని భాషల్లోనూ డివైడ్ టాక్ తెచ్చుకుంది. మొదటి షో కే డివైడ్ టాక్ రావడంతో ఓపెనింగ్ కలెక్షన్స్ మీద బాగా ఎఫెక్ట్ పడింది. తర్వాత నుండి రాధే శ్యామ్ కలెక్షన్ డల్ అయ్యాయి. ఫస్ట్ వీకెండ్ లోను రాధే శ్యామ్ పెరఫార్మెన్స్ అంతమాత్రంగానే ఉంది. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు.. రాధే శ్యామ్ కి డిజాస్టర్ టాక్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రభాస్ లుక్స్, రాధా కృష్ణ దర్శకత్వం, పాటల్లో పట్టు లేకపోవడం, యాక్షన్ లేకపోవడం ఇలా సినిమా పోవడానికి అనేక మైనస్ పాయింట్స్ కారణాలయ్యాయి. ప్రభాస్ సినిమా వీక్ డేస్ లో లక్షల్లో కలెక్షన్స్ తెచ్చుకుంది అంటే ఎంత దారుణమో అర్ధమవుతుంది.. రాధే శ్యామ్ ఫస్ట్ వీక్ కల్లెక్షన్స్ మీ కోసం..
ఏరియా కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం - 24.20
సీడెడ్ - 7.24
ఉత్తరాంధ్ర - 4.68
ఈస్ట్ - 4.19
వెస్ట్ - 3.23
గుంటూరు - 4.37
కృష్ణా - 2.59
నెల్లూరు - 2.09
ఏపీ, తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 52.59 కోట్లు
కర్ణాటక - 4.18
తమిళనాడు - 0.75
కేరళ - 0.18
హిందీ - 8.95
రెస్టాఫ్ ఇండియా-1.58
ఓవర్సీస్ - 11.30
ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ టోటల్: 79.36 కోట్లు షేర్