ఇప్పుడు కరోనా కానివ్వండి, లేదంటే టికెట్ రేట్స్ హైక్ చూసి కానివ్వండి చాలామంది థియేటర్స్ లో సినిమా చూడడానికి వెనక్కి తగ్గుతున్నారు. లేడీస్ అయితే మరీను. అది థియేటర్స్ మనుగడకే ప్రమాదంగా తయారైంది. మరోపక్క భారీ బడ్జెట్ సినిమా అయినా, చిన్న సినిమా రిలీజ్ అయినా అదే రోజు ఆ సినిమా ఏ ఓటిటి లో వస్తుంది, ఏ రోజు ఓటిటి నుండి రిలీజ్ అవుతుంది అనే న్యూస్ లు వెబ్ సైట్స్ లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలే థియేటర్స్ కి వెళ్ళడానికి బద్ధకిస్తున్న ప్రేక్షకులు ఇలా ఓటిటి డేట్ చూడగానే.. ఇంకెదుకు వెళ్తారు. ఆ ఓ నెల అయితే ఓటిటిలో వచ్చేస్తుంది కదా అని.. ఇంట్లోనే హాయిగా 60 ఇంచెస్ టీవీలో చూసేద్దాం అని ఫీలవుతున్నారు.
మరి ఈ ఓటిటి కల్చర్ వలన థియేటర్స్ వ్యవస్థకి, అటు నిర్మాతలకు ఎప్పటికైనా ప్రమాదమే. నిర్మాతలు కాసులకి కక్కుర్తి పడి భారీ రేట్ల కి సినిమాలు రిలీజ్ అయిన నెల రోజులకే ఓటిటి లో రిలీజ్ చేసుకోవచ్చు అంటూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అలా ఆడియన్స్ కూడా థియేటర్స్ కే వెళ్లి సినిమా చూడాలా.. ఇప్పటివరకు ఆగిన వాళ్ళం ఓ నెల రోజులు ఆగలేమా అనే పంథాలోకి వెళ్లిపోతున్నారు. ఇది చిన్న సినిమాలకి ఎలా ఉన్నా భారీ బడ్జెట్ సినిమాలపై మాత్రం ఈ ఓటిటి ఎఫెక్ట్ బాగా పడేటట్లే కనిపిస్తుంది. ఉదాహరణకు రాధే శ్యామ్ నే తీసుకోండి. సినిమా రిలీజ్ అయిన తెల్లారే.. ఏప్రిల్ 2 న రాధే శ్యామ్ ఓటిటి రిలీజ్ అనే న్యూస్ లు పలు వెబ్ సైట్స్ లో దర్శనమిచ్చాయి. కనీసం ఇలాంటి వాటిని ఆపినా ఎంతోకొంత ప్రయోజనం అయితే ఉండకపోదు.