కరోనా కష్టాన్ని తట్టుకుని.. ఎన్నో డేట్స్ మార్చుకుని ఎట్టకేలకు ట్రిపుల్ ఆర్ మార్చ్ 25 న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఎన్నో అంచనాలు, ఎంతో హైప్ ఉన్న ట్రిపుల్ ఆర్ కి పోటీగా ఏ లాంగ్వేజ్ లోను సినిమాలు రిలీజ్ చెయ్యడం లేదు. అటు ట్రిఫుల్ ఆర్ ని తట్టుకోవడము కష్టము, అలాగే ఓ వారం పాటు ట్రిపుల్ ఆర్ కి పోటీ ఇవ్వడం ఎందుకు అని చాలామంది వెనక్కి తగ్గారు. కానీ భీమ్లా నాయక్ మేకర్స్ మాత్రం మనసులో ఏదో పెట్టుకుని ట్రిపుల్ ఆర్ పై కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతున్న రోజే భీమ్లా నాయక్ మూవీ ని ఓటిటి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
మార్చ్ 25 ట్రిపుల్ ఆర్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే.. అదే 25 న భీమ్లా నాయక్ రెండు ఓటిటీ ప్లాట్ ఫార్మ్స్ నుండి రిలీజ్ చేస్తున్నారు. థియేటర్స్ లో ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన సినిమా ఓటిటిలో రిలీజ్ అయితే ట్రిపుల్ ఆర్ కి పోటీ ఏమిటి అనుకున్నా.. ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే తెలుగు రాష్ట్రాల్లో పడుతుంది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ఉదయం థియేటర్స్ లో చూసి సాయంత్రం భీమ్లా నాయక్ చూసి తెల్లారి ఐపీఎల్ చూద్దాం అంటూ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి భీమ్లా మేకర్స్ భీమ్లా ఓటిటి రిలీజ్ ని ఉగాది సందర్భంగా పెట్టుకుంటే బావుండేది అంటూ చాలామంది సలహాలు ఇస్తున్నారు. ట్రిపుల్ కి ఓ వారం గ్యాప్ ఇచ్చినట్టు ఉండేది. ఉగాది ఫెస్టివల్ కి భీమ్లా ఓటిటి రిలీజ్ ఉంటే భారీ హైప్ ఉండేది అంటున్నారు.