Advertisementt

నేను రాజకీయాలకి సూట్ కాను: సునీల్

Thu 17th Mar 2022 07:57 PM
comedian sunil,hero sunil,political entry,pawan kalyan,jana sena party  నేను రాజకీయాలకి సూట్ కాను: సునీల్
Sunil about political entry నేను రాజకీయాలకి సూట్ కాను: సునీల్
Advertisement
Ads by CJ

కమెడియన్ గా పీక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు హీరో గా అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుని హీరోగా సినిమాలు చేసి ఒకటి రెండు సక్సెస్ లతో సరిపెట్టుకుని ఇంకా హీరోగానే ట్రై చేస్తున్న సునీల్ కి మధ్యలో ఆయన ఫ్రెండ్ త్రివిక్రమ్, సుకుమార్ లాంటి వాళ్ళు తమ సినిమాల్లో కేరెక్టర్స్ ఇస్తున్నారు. అయిపోతే ఇటు సినిమాల్తో బిజీగా వుండే సునీల్.. ఈ మధ్యన రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరి ఆయన నియోజకవర్గం భీమవరం నుండి పోటీ చెయ్యబోతున్నారంటూ వస్తున్న రూమర్స్ పై స్పందించారు. తనకి రాజకీయాలు సూట్ కావని. పవన్ కళ్యాణ్ గారు అడిగినా అదే చెప్పాను అంటూ ట్విస్ట్ ఇచ్చారు సునీల్.

నేను జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. నాకు రాజకీయాలతో టచ్ లేదు. రాజకీయాలంటే ఏమిటో తెలియవు. నేనసలు పాలిటిక్స్ కి క్వాలిఫైడ్ కాదు అనుకుంటున్నాను. పవన్ గారికి నేను అంటే చాలా ఇష్టం. ఆయనకి నన్ను జనసేనలోకి ఆహ్వానించాలని చాలా ఉంది. కానీ నాకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. మనం జనాభాకి న్యాయం చేయలేనప్పుడు పాలిటిక్స్ కి సూట్ కాము, ఫండ్స్ తక్కువ ఉన్నప్పుడు అందరిని శాటిస్ ఫై చేయలేము. వాళ్ళు నానారకాల మాటలు మాట్లాడతారు. మనం ఎందుకు అనిపించుకోవాలి. అందుకే నాకు రాజకీయాలంటే అస్సలు ఇష్టం లేదు.

నాకు పవన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు నా వంతు సహాయం అవసరం వచ్చినప్పుడు చేస్తాను. కానీ ఆ సహాయం రాజకీయంగా కాదు. ఎందుకంటే రాజకీయాల గురించి తెలియని నేను అందులో ఎలాంటి హెల్ప్ చెయ్యగలను, నేను అస్సలు రాజకీయాలకి సూట్ కాను అంటూ ఓపెన్ గా పొలిటికల్ ఎంట్రీ పై స్పందించారు సునీల్. 

Sunil about political entry :

Comedian sunil about political entry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ