ఆర్.ఆర్.ఆర్ సినిమా మరో వారం రోజుల్లో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రపంచం మొత్తం తెలుగు సినిమావైపే చూస్తుంది. అంతలా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పై అటెంక్షన్ క్రియేట్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూడాలా అని తెలుగు ప్రేక్షకులే కాదు.. సినిమా విడుదలవుతున్న అన్ని లాంగ్వేజ్ ఆడియన్స్ ఆతృతగా ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ దర్శకహీరోలు అప్పుడే ప్రమోషన్స్ లోకి దూకేశారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్, కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఓ ఫన్నీ టాక్ షో చేసేసారు. కానీ వీటిలో హీరోయిన్ అలియా భట్ మాత్రం కనిపించలేదు. రేపు 19 న చిక్కబళ్లాపూర్ లో జరగబోయే బిగ్గెస్ట్ ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీస్ ఈవెంట్ కయినా వస్తుందా అనేది డౌట్.
రాజమౌళి హీరోలతో సమానమైన ప్రమోషన్స్ అలియా కి ఇచ్చారు. డిసెంబర్ లో హిందీ ప్రమోషన్స్ అన్నిటిలోను, అన్ని లాంగ్వేజ్ ప్రెస్ మీట్స్ లో పాల్గొన్న అలియా మొన్న జరిగిన బర్త్ డే వేడుకల కోసం మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ బర్త్ డే సెలెబ్రేషన్స్ తో పాటుగా.. మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన ఫొటోస్ చూసిన ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలే సినిమా లేట్ గా రిలీజ్ అవుతుంది. ఎంత ప్రమోట్ చేస్తే అంత హైప్ క్రియేట్ అవుతుంది. హీరోలిద్దరూ, రాజమౌళి అంతలా కష్టపడుతున్నారు. అలియా మాత్రం వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తుంది. వచ్చే వారం నుండి ఆరురోజుల పాటు తొమ్మిది సిటీస్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ ఉన్నాయి. వాటిలో అయినా అలియా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు.
మార్చ్ 18 న ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ దుబాయ్ లో జరగబోతుంది, 19 న చిక్కబళ్లాపూర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు మేకర్స్.