మార్చ్ 25 న ఆర్.ఆర్.ఆర్ వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. అయితే ఆర్.ఆర్.ఆర్ కి ఏపీలో టికెర్ రేట్స్ పెంచుకునే విషయమై రాజమౌళి, నిర్మాత దానయ్యలు ఏపీ సీఎం జగన్ తో చర్చించి వచ్చారు. కానీ అప్పుడు జగన్ రాజమౌళి వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. ఇక ఆర్.ఆర్.ఆర్ బెన్ఫిట్ షోస్ విషయంలోనూ రాజమౌళి.. ఐదు ఆటలంటే రోజూ ఆర్.ఆర్.ఆర్ కి బెన్ఫిట్ షోనే అన్నారు కానీ.. వివరాలు ఇవ్వలేదు. అయితే తాజాగా మంత్రి పేర్ని నాని మట్లాడుతూ హీరోల రెమ్యునరేషన్ పరిగణనలోకి తీసుకోకుండా, 100 కోట్లు పెట్టి బడ్జెట్ సినిమా తీసిన వారికి.. ఓ పది రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం ఉంది. దాని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్.ఆర్.ఆర్ దర్శక నిర్మాతలు 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమా కాబట్టి ఆర్.ఆర్.ఆర్ కి దరఖాస్తు చేసుకున్నారు. దానిని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని, ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీరో మేరకే సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని ఆయన అన్నారు. సామాన్య ప్రజలకి భారం కాకుండా సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవచ్చని, ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పడంతో.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే పేర్ని నాని ఇంకా ఆన్‌లైన్ టికెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని అన్నారు. ఇందులో రెండు కంపెనీలు పాల్గొన్నాయని.. ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.