Advertisementt

సూర్యకి హెల్ప్ చేసిన ప్రభాస్

Thu 17th Mar 2022 11:15 AM
suriya movie et evarikee talavanchadu collection,et movie revenue,et movie review,et telugu review,et telugu version collections  సూర్యకి హెల్ప్ చేసిన ప్రభాస్
Prabhas Helped Tamil Hero Suriya సూర్యకి హెల్ప్ చేసిన ప్రభాస్
Advertisement
Ads by CJ

రాధే శ్యామ్ తో అభిమాన ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయిన ప్రభాస్ తమిళ హీరో సూర్యకి మాత్రం చాలా పెద్ద హెల్ప్ చేసాడు. ఎలాగంటే...

మార్చి 10 న విడుదలైన సూర్య చిత్రం ET (ఎవరికీ తల వంచడు) చప్పగా ఉందనే టాక్ తో చతికిలపడింది. అయితే మార్చి 11 న వచ్చిన రాధే శ్యామ్ మరీ నిరాశపరచడంతో ఎలాగోలా సర్దుకుందాం.. సరిపెట్టుకుందాం అనుకుంటూ ET థియేటర్స్ వైపు కదిలిన జనం ఆ ఫ్లాప్ ఫిలింకి ఆశించిన దానికంటే ఎక్కువ రెవిన్యూ వచ్చేలా చేయడం విశేషం. 

4 కోట్లకు బ్రేక్ ఈవెన్ అనే టార్గెట్ తో బరిలోకి దిగిన ET మూవీకి ఫస్ట్ డే వచ్చిన రివ్యూస్ అండ్ రిపోర్ట్స్ చూస్తే 50 పర్శంట్ రికవరీ కూడా పాజిబుల్ కాదేమో అనుకున్నారు అందరూ. అయితే అనూహ్యంగా ఆ చిత్రానికి ఫస్ట్ వీక్ లోనే 2 కోట్ల 80 లక్షలు సమర్పించి తెలుగువారికి అడాప్టెడ్ సన్ అని చెప్పుకునే సూర్య పట్ల ప్రేమను చాటుకున్నారు మన ప్రేక్షకులు. ఈ వీక్ కూడా పెద్ద సినిమాలేవీ లేవు కనుక ఆర్ ఆర్ ఆర్ రంగంలోకి దిగేలోపు మరో కోటీ ఇరవై లక్షలు రాబడితే నిజంగా సూర్య తలవంచని ఫలితం అందుకున్నట్టే..!

ET (ఎవరికీ తల వంచడు) ఫస్ట్ వీక్ AP-TG కలెక్షన్స్ 

నైజాం : 88 లక్షలు

సీడెడ్ : 47 లక్షలు

ఉత్తరాంధ్ర : 43 లక్షలు

ఈస్ట్ : 26 లక్షలు

వెస్ట్ : 18 లక్షలు

గుంటూరు : 23 లక్షలు

కృష్ణా : 21 లక్షలు

నెల్లూరు : 14 లక్షలు

AP - TG టోటల్ ఫస్ట్ వీక్ షేర్ : 2.80 Cr

Prabhas Helped Tamil Hero Suriya:

ET Telugu Movie First Week Collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ