Advertisementt

దుల్కర్ కి షాక్.. సినిమాలు బ్యాన్

Thu 17th Mar 2022 11:00 AM
kerala theatres,kerala theatre owners,dulquer movies,dulquer salmaan  దుల్కర్ కి షాక్.. సినిమాలు బ్యాన్
Dulquer Salmaan Banned By Kerala Theatre Owners దుల్కర్ కి షాక్.. సినిమాలు బ్యాన్
Advertisement
Ads by CJ

మలయాళంలో మమ్ముట్టి వారసుడిగా సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్టార్ హీరో గుర్తింపు తెచ్చుకుని స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న దుల్కర్ సల్మాన్ కి ఇటు తెలుగు, తమిళ్ లోను హీరోగా పవర్ చూపిస్తున్నాడు. వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. తెలుగులో మహానటి తో, కనులు కనులను దోచాయంటే.. సినిమాలతో మర్కెట్ పెంచుకున్నాడు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న దుల్కర్ కి మలయాళ థియేటర్ సంఘాలు షాకిచ్చాయి. దుల్కర్ సినిమాలను థియేటర్స్ లో విడుదల చెయ్యకుండా బాయ్ కాట్ చేయాలని ది ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ నిర్ణయం తీసుకుంది.

అలా దుల్కర్ మీద థియేటర్స్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చెయ్యడానికి కారణం.. దుల్కర్ ఈ మధ్యన తన చిత్రాలను ఓటిటి నుండి రిలీజ్ చెయ్యడం, తాజాగా సెల్యూట్ మూవీ ని స్ట్రయిట్ ఓటిటి రిలీజ్ చెయ్యడానికి సోని లివ్ తో ఒప్పందం చేసుకోవడంతో.. దుల్కర్ తన సినిమాలని థియేటర్స్ లో రిలీజ్ చెయ్యకుండా ఇలా నేరుగా ఓటిటి నుండి ఎలా రిలీజ్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన సినిమాల్ని థియేటర్స్ లో రిలీజ్ చెయ్యకుండా బాయ్ కాట్ చేయాలని థియేటర్ల యజమానులు నిర్ణయించారు

Dulquer Salmaan Banned By Kerala Theatre Owners:

Kerala theatre owners association to boycott Dulquer movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ