అన్నీ బాహుబలి కాలేవు అని సూక్తులు చెప్పేవాళ్లకు తెలియదా ప్రతి సినిమాకీ బాహుబలి అంత బడ్జెట్ పెట్టకూడదని.?
ఏ సినిమాని ఆ సినిమాగానే చూడాలి అంటూ నీతులు పలికేవాళ్లకు పట్టదా ఫలితం తేడా వస్తే ఎన్ని కోట్లు పట్టుకుపోతుందని.?
వాళ్ళ భ్రమలు పటాపంచలు చేసి నేలమీదికి దించేందుకు - వాస్తవంలోకి తెచ్చేందుకే రాధే శ్యామ్ చిత్రాన్ని తీవ్రంగా తిరస్కరించినట్టు వున్నారు ప్రేక్షకులు.
బాహుబలిగా తిరుగులేని ప్రతిభ చూపిన ప్రభాస్ కి తమ హృదయ సామ్రాజ్యంలో పట్టం కట్టేసిన ప్రపంచ సినీ ప్రియులందరూ ఆపై సో సో గానే ఉన్న అవుట్ ఫుట్ కి సాహూ అన్నారు కానీ.. రాధే శ్యామ్ కి మాత్రం బాబోయ్ అనేసారు. భరించలేమనే మౌత్ టాక్ ని బయటికి తెచ్చేసారు. దాంతో ఎంత పెట్టి కొనుక్కున్న రివ్యూలైనా పనికిరాకుండా పోయాయి. పబ్లిసిటీ ప్రగల్భాలు మూడు రోజులకే ముడుచుకున్నాయి. ఇక మొదట్లో రికార్డులు, కలెక్షన్లు, పోస్టర్లు, ప్రెస్ నోట్లు అవన్నీ సోషల్ మీడియాలో హల్ చల్ చేసుండొచ్చు గాక... నాలుగో రోజుకే నామ మాత్రపు వసూళ్లకు నానా కష్టాలూ పడ్డ సినిమాకి అవేం పనికొస్తాయండీ.!
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అమితంగా అభిమానించే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం అందరికీ ఆనందమే. ముఖ్యంగా కింగ్ ఖాన్స్ నే ఇష్టపడే నార్త్ ఆడియన్స్ ప్రభాస్ ఛార్మ్ కి ఫిదా అయిపోవడం మనకి కిక్కిచ్చే విషయమే. అయితే వాళ్ళు ఇష్టపడింది మన సినిమాని. మన ప్రభాస్ ని.! ఇష్టపడుతున్నారు కదా అని వాళ్ళే లక్ష్యం అయిపోయి మనల్ని నిర్లక్యం చేస్తున్నాడేంటీ అని గుబులు పడుతున్నారు రెబెల్ ఫ్యాన్స్.
ఆఫ్ కోర్స్.. వాళ్ళ ఆవేదనలోనూ అర్ధం ఉంది. ప్రభాస్ సినిమా పాటలంటే ఓ వర్షం. ఓ ఛత్రపతి. ఓ డార్లింగ్. ఓ Mr పర్ ఫెక్ట్. ఓ మిర్చి. ఓ బాహుబలి. అంతేకానీ సాహూలు, రాధే శ్యామ్ లు కాదు వాళ్లకి కావాల్సింది. పాటే కాదు ఈవెన్ ఫైట్ అయినా.. ప్రభాస్ కట్ అవుట్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే ఎలివేషన్సూ అవే. ఇవి కాదు.
అలాంటిది అవన్నీ వదులుకుని, వద్దనుకుని రాధే శ్యామ్ లాంటి సినిమా చేస్తే నార్త్ ఆడియన్స్ ఇచ్చిన ఆరు రోజుల నెట్ రెవిన్యూ పట్టుమని పద్దెనిమిది కోట్లు కూడా లేదు. బ్రేక్ ఈవెన్ కి అక్కడ 110 కోట్లు రావాలట. అది జరిగే పనేనా.!
ఇక మన తెలుగు రాష్ట్రాల సంగతి కాస్త బెటరే కానీ ఇక్కడా ఇక్కట్లు తప్పవు. అన్ని చోట్లా అదే పరిస్థితి కనిపిస్తోంది కనుక ఆ రెవిన్యూ లెక్కలు రేపటి ఫస్ట్ వీక్ రిపోర్ట్ లో చూసుకుందాం.
మరి చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ వంటివి లెక్కల్లో చూపించి ప్రొడ్యూసర్ హ్యాపీ అనే చెప్పొచ్చు. కష్టాన్ని దాచుకోవడం అనేది నష్టపోయిన వాళ్ళ ఇష్టం. కానీ పరాజయాన్ని తట్టుకోలేక ప్రాణాలే తీసుకునేంతటి అభిమానులున్న ప్రభాస్ కి ఇది ఆషామాషీ విషయం కాదు. తన ఫ్యాన్స్ ని ప్రాణప్రదంగా ప్రేమించే డార్లింగ్ కి ఇది నిజంగా రియలైజ్ అవ్వాల్సిన టైమ్. రియాలిటీలోకి రావాల్సిన టైమ్. ఒకటైతే నిజం... ఒక్క రిజల్ట్ తో తడబడే ఫ్యాన్ బేస్ కాదు ప్రభాస్ ది. ఒక్క ఫెయిల్యూర్ తో షేక్ అయ్యే సాధారణ స్టార్ డమ్ కాదు యూనివర్సల్ డార్లింగ్ ది.
సరిగ్గా దృష్టి పెట్టాడా సలార్ తో సునామీ చూస్తాం. ఆదిపురుష్ కి ప్రణామాలు చేస్తాం.
సాటి లేని ఆ రాచ ఠీవీకి మళ్ళీ మనమే సెల్యూట్ అంటాం.!