బిగ్ బాస్ నాన్ స్టాప్ 17 రోజులు పూర్తి చేసుకోబోతుంది. గత రెండు వారాల్లో ముమైత్ ఖాన్ వారియర్స్ టీం నుండి ఎలిమినేట్ అవ్వగా, శ్రీ రాపాక చాలెంజర్స్ టీం నుండి ఎలిమినేట్ అయ్యింది. ఇక మొదటి వారం తేజు టాస్క్ ల్లో గెలిచి ఫస్ట్ కెప్టెన్ గా అయ్యింది. తర్వాత రెండో వారానికి చాలెంజర్స్ టీం నుండి అనిల్ కెప్టెన్ అయ్యాడు. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ అనిల్ కెప్టెన్సీలో అందరూ హ్యాపీ నా అనగానే ఓ అందరం హ్యాపీ అన్నారు. అనిల్ మీ కెప్టెన్సీ పట్ల మీరెలా ఫీలవుతున్నారు అనగానే సూపర్ గా ఉన్నాను సర్ అన్నాడు. అయితే మీ కెప్టెన్సీ లో హౌస్ మేట్స్ ఎలా ఉన్నారో అనేది స్క్రీన్ మీద వేసి చూపించాడు బిగ్ బాస్.
అందులో అరియనా నిద్రపోతుండగా కుక్క మొరిగే సౌండ్ వినిపించింది. తర్వాత నటరాజ్ మాస్టర్ సోఫాలో పడుకున్నాడు. ఆ తర్వాత బిందు మాధవి, యాంకర్ శివ అలానే పడుకున్నారు.. ఇంకా ఆశు రెడ్డి తో పాటుగా మరో ఇద్దరిని మైక్ వేసుకోమంటూ బిగ్ బాస్ హెచ్చరికలు స్క్రీన్ మీద చూపించారు. దానితో అనిల్ ఫేస్ మాడిపోయింది. మీ కెప్టెన్సీ విషయంలో బిగ్ బాస్ ఆనందంగా లేరు అంటూ మీ కెప్టెన్సీ ఇప్పుడే ఈ క్షణమే రద్దు చెయ్యబడింది.. మీ కెప్టెన్సీ బ్యాండ్ తీసి స్టోర్ రూమ్ లో పెట్టిరండి అనిల్ అంటూ బిగ్ బాస్ ఆదేశించగానే అందరూ షాకవ్వగా.. అనిల్ అయితే కాస్త బాధగా తన కెప్టెన్సీ బ్యాండ్ తీసి స్టార్ రూమ్ లో పెట్టి వచ్చిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.